ఐపీఎల్ వేలం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు?

praveen
నేడు ఐపీఎల్ వేలం జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ వేలంలో భాగంగా ఎవరు భారీ ధర పలుకుతారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.  కొన్ని ఫ్రాంచైజీలు ఇక జట్టులోకి కీలక ఆటగాళ్లను తీసుకొని జట్టును మరింత పటిష్టంగా మార్చుకునేందుకు ప్రణాళికలను  సిద్ధం చేసుకుంటే.. మరి కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం ఏకంగా జట్టు బాధ్యతలను  భుజాన వేసుకొని ముందుకు నడిపించే కెప్టెన్ కోసం వెతుకులాట ప్రారంభించాయి అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో ప్రేక్షకుల అంచనాలు తారుమారు అయ్యాయి అని చెప్పాలి. మెగా వేలంలో ఉన్న ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లకు భారీ ధర పలకడం ఖాయమని ఎంతోమంది అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో అన్ని ఫ్రాంచైజీలు కూడా ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని కేవలం యువ ఆటగాళ్ళను కొనుగోలు చేసేందుకే పెద్ద పీట వేసారు. దీంతో ఎంతో మంది యువ ఆటగాళ్లు భారీ ధర పలికారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేలం జరుగుతూ ఉండగా ఇక ఇద్దరు స్టార్ ప్లేయర్లు కొనుగోలు కానీ ఆటగాళ్లుగా మిగిలిపోయారు అనేది తెలుస్తుంది.

 ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఎవరో కాదు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ రూసో. ఇద్దరికీ కూడా ఐపీఎల్ మినీ వేలం లో షాక్ తగిలింది. రెండు కోట్ల బేస్ ప్రైస్ ఉన్న రూసోని ఒక కోటి బేస్ ప్రైస్ ఉన్న జో రూట్ న తొలి సెట్ లో అమ్ముడుపోలేదు. ఇక ఇద్దరు ప్లేయర్లను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ  కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.  మొన్నటికి మొన్న జరిగిన టి20 వరల్డ్ కప్ లో రూసో సెంచరీ తో చెలరేగిపోయినప్పటికీ ఇక ఏ ఫ్రాంచైజీ  అతని కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే అన్ సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోతాడు అనుకున్న అజంక్య రహనేని 50 లక్షల బేస్ ప్రైస్ తో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: