పిసిబి షాకింగ్ నిర్ణయం.. హెడ్ కోచ్ తో పాటు కెప్టెన్ పై వేటు?

praveen
సాధారణంగా పాకిస్తాన్ జట్టును వారి సొంత దేశంలో ఓడించడం కాస్త కష్టమైన పని అని మొన్నటి వరకు ఎంతో మంది క్రికెట్ నిపుణులు చెప్పేవారు. కానీ అవన్నీ కేవలం వట్టి మాటలు మాత్రమే అంటూ నిరూపించింది ఇంగ్లాండ్ జట్టు. చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించి 3-0 తేడాతో పాకిస్తాన్ ను వారి సొంత మైదానాల్లోనే క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయ్యి ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి.

 ఈ క్రమంలోనే ఇక సొంత గడ్డపై ఇలా పాకిస్తాన్ జట్టు ఘోర ఓటమి చవి చూడటంతో ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో ప్రక్షాళన మొదలైంది అన్నది మాత్రం తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే అటు జట్టు చైర్మన్ గా ఉన్న రమిజ్ రాజాను పదవి నుంచి తప్పిస్తారు అన్న క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు మరో  కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ హెడ్ కోచ్ గా ఉన్న సక్లైన్ ముస్తాక్, కెప్టెన్ బాబర్ అజాంపై కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గవర్నింగ్ కౌన్సిల్ కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

 స్వదేశంలో న్యూజిలాండ్తో  జరగబోయే  టెస్ట్ సిరీస్ అనంతరం  ముస్తాక్ ను ఇక హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నాడట. అదే విధంగా వచ్చే ఏడాది జూలైలో కెప్టెన్ బాబర్ అజం సైతం టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుపోతున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పాక్ క్రికెట్ బోర్డు ఉన్నత స్థాయి సమావేశం జరగ్గా.. ఇక ఇందులో పిసిబి చైర్మన్ తో పాటు చీఫ్ సెలెక్టర్ కూడా పాల్గొన్నారు. ఇక హెడ్ కోచ్ తో పాటు బాబర్ను కూడా తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

0cb

సంబంధిత వార్తలు: