పిసిబి చైర్మన్గా రమిజ్ రజా ఔట్.. తిక్క కుదిరిందంటున్న ఇండియా ఫ్యాన్స్?

praveen
మొన్నటికి మొన్న భారత జట్టు వరల్డ్ కప్ లో ఘోర వైఫల్యం తర్వాత ఇక బీసీసీఐ ప్రక్షాళన చేయడం మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోచింగ్ సిబ్బంది దగ్గర నుంచి ఏకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు వరకు అన్ని మార్పులు జరిగాయి. చివరికి సెలక్షన్ కమిటీని కూడా మార్చుతూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఇక ఇప్పుడు ఇదే పరిస్థితి అటు భారత దాయాది దేశమైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కూడా జరుగుతుంది అన్నది తెలుస్తుంది. ఇటీవల సొంత గడ్డపై పాకిస్తాన్  ఘోర పరాభవాన్ని చవిచూసింది అన్న విషయం తెలిసిందే.

 సాధారణంగా అయితే పాకిస్తాన్ జట్టును వారి సొంత గడ్డమీద ఓడించడం అసాధ్యం అని అంటూ ఉంటారు క్రికెట్ నిపుణులు. కానీ ఎన్నో ఏళ్ల తర్వాత అటు పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ కోసం అడుగుపెట్టిన ఇంగ్లాండు జట్టు తమ దూకుడైన ఆట తీరుతో పాకిస్తాన్ను దారుణంగా ఓడించింది. ఇక మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించిన ఇంగ్లాండు జట్టు మూడు సున్నా తేడాతో ఆతిధ్య పాకిస్తాన్ ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పాక్ ఘోర ఓటమి కారణంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం ప్రక్షాళనపై దృష్టి పెట్టింది.

 ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్న రమిజ్ రాజపై వేటుపడింది. ఇక రమిజ్ రాజ్ స్థానంలో పిసిబి చైర్మన్గా 74 ఏళ్ళ నజమ్ సెతీ  ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నియమించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని పాక్ మీడియా అధికారికంగా ప్రకటించిందట. 2021 సెప్టెంబర్ లో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రమిజ్ రాజాని  క్రికెట్ బోర్డు చైర్మన్గా నియమించారు. కానీ ఇప్పుడు పదవి నుంచి తొలగించి ఇక కొత్త చైర్మన్ను నియమించడం గమనార్హం. కాగా నజం సెతీ పిసిబి చైర్మన్గా ఎంపిక కావడం ఇది రెండోసారి. 2017లోపిసిబి చైర్మన్గా పనిచేశారు.. బిసిసిఐపై తీవ్ర విమర్శలు చేసిన రమిజ్ రాజా ఇక ఇప్పుడు పిసిబి చైర్మన్గా తప్పుకోవడంతో తిక్కకదిరింది అంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: