టైటిల్ విన్నర్ రేవంత్.. బిగ్ బాస్ లో ఎంత సంపాదించాడో తెలుసా?

praveen
బిగ్ బాస్ తెలుగు ఆరవ సీజన్ ముగిసింది. ప్రేక్షకులు ఊహించినట్లుగానే కాస్త రంజుగా.. కాస్త సాదాసీదాగా సాగింది బిగ్ బాస్ సీజన్. ఇక ఇటీవల  ఫైనల్ ఎపిసోడ్లో అందరూ అనుకున్నట్లుగానే ఊహించని ట్విస్ట్ లు ఉన్నాయి అని చెప్పాలి. మొదటి నుంచి ప్రేక్షకులు అందరూ అనుకున్నట్లుగానే బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ వచ్చిన రేవంత్ ఇక విజేతగా నిలిచాడు అని చెప్పాలి. ఇక అంతకుముందు టాప్ 2 లో ఉన్న శ్రీహాన్ 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుంటున్నట్లు ఒప్పుకోవడంతో చివరికి రేవంత్ బిగ్ బాస్ ట్రోఫీ పోటీ లేకుండానే అందుకున్నాడు.

 ఈ క్రమంలోనే టైటిల్ విన్నర్ గా  నిలిచిన రేవంత్ పది లక్షల ప్రైస్ మనీ తో పాటు ఇక బిగ్ బాస్ ఇచ్చే మరికొన్ని బహుమతులను కూడా అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక బిగ్ బాస్ లో 15 వారాలు కొనసాగినందుకు అంతేకాకుండా ప్రైజ్ మనీ ద్వారా మొత్తంగా ఇక టైటిల్ విన్న రేవంత్ ఎంత సంపాదించాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రేవంత్ అతని క్రేజ్ కు తగ్గట్టుగానే వారానికి 65,000 రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ఇక 15 వారాలు పాటు హౌస్ లో కొనసాగినందుకు గాను 9.75 లక్షలు పారితోషకం అందుకున్నాడట.

 ఇక ఈ సీజన్లో రేవంత్ అందుకున్నదే అత్యధిక మొత్తం అన్నది తెలుస్తుంది. ఇక టైటిల్ విన్నర్ గా మారిన తర్వాత రేవంత్ పది లక్షల మాత్రమే గెలుచుకున్నాడు  అంతేకాకుండా 30 లక్షల విలువైన ప్లాట్.. 13 లక్షల విలువైన కార్ కూడా సొంతం చేసుకున్నాడు. అంటే ఇక మొత్తంగా 62.75 లక్షల రూపాయలను బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం ద్వారా రేవంత్ సొంతం చేసుకున్నాడని చెప్పాలి. ఇక ప్రైజ్ మనీలో 31.2% పన్ను కట్ అవ్వగా.. అతనికి దక్కేది 6.8 లక్షలు మాత్రమే. అంటే ఇక టాక్స్ లు పోను అతను కేవలం 50 లక్షలు మాత్రమే సంపాదించినట్లు లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: