వారితో ఆడితే.. మెన్స్ టీమ్ తో ఆడినట్లే : షఫాలి వర్మ

praveen
ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళలు జట్టుతో భారత ఉమెన్స్ టీం టి20 సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత్ ను ఇక సొంతగడ్డ పైన చిత్తు చేస్తూ వస్తుంది అని చెప్పాలి. ఇక మొదటి మ్యాచ్ లో గెలిచి ఊహించని షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఆ తర్వాత రెండో మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా జట్టు.. గత కొంతకాలం నుంచి ఓటమి ఎరుగని జట్టుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాను ఓడించి వరుస విజయాలకు బ్రేక్ వేసింది.

 తర్వాత మ్యాచ్లో టీమిండియా అదే జోరును కొనసాగిస్తుంది అనుకున్నప్పటికీ.. మూడో మ్యాచ్లో మళ్లీ ఓడిపోయింది. అయితే ఇక సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాల్సిన నాలుగో మ్యాచ్లో కూడా టీమిండియా ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా 3-1 తేడాతో టీమిండియా సిరీస్ కోల్పోయింది. అయితే ఆస్ట్రేలియా జట్టుతో పోటీ ఎలా ఉంటుంది అనే విషయంపై ఇక టీమిండియా మహిళల జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న శేపాలి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఆస్ట్రేలియా మహిళల జట్టుతో పోటీ పడుతుంటే ఏకంగా మెన్స్ టీం తో పోటీపడినట్లు ఉంటుంది అంటూ  వ్యాఖ్యానించింది. వారు చాలా బలంగా ఉంటారని.. వారిని ఎదుర్కోవాలంటే ప్రత్యర్ధులు కూడా అంతే దృఢంగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది. నాకు ఆస్ట్రేలియా తో ఆడటం అంటే ఎంతో ఇష్టం. వారితో తలపడుతుంటే ఏకంగా పురుషులతో పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది.  ఇక వారి బౌలింగ్లో ఒక్క ఫోర్ కొట్టిన ఉత్సాహంగా ఉంటుంది. ఒక క్రీడాకారిణిగా మెరుగుపడ్డానని అనిపిస్తుంది. ఎందుకంటే మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ఒక బలమైన జట్టు.. ఆస్ట్రేలియా బౌలర్లకు వ్యతిరేకంగా బౌండరీలు కొట్టడం.. ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుంది. అదే ఇంగ్లాండు, మరో టీం తో బౌండరీలు బారిన అంత ఆనందం ఉండదు అంటూ షపాలి వర్మ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: