వావ్.. ఇండియాకు మరో జడేజా దొరికేసాడా?

praveen
రవీంద్ర జడేజా ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన ఆట తీరుతో ఏకంగా జట్టులో కీలక ఆటగాడిగా ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఫార్మట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శనతో ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఒకవైపు తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూనే.. ఇక జట్టుకు అవసరమైన సమయంలో మెరుపు బ్యాటింగ్ తో ఆదుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు మైదానంలో పాదరసంలో కదులుతూ  మెరుపు ఫీల్డింగ్ తో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అలాంటి రవీంద్ర జడేజా ఇటీవలే గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు.

 దీంతో జడేజా లాంటి ఆల్ రౌండర్ కోసం టీమిండియా గత కొంతకాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఎంతో మంది ఆటగాళ్లను మారుస్తూనే ఉంది.  కానీ ఎవరు ఇక రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తి చేయలేకపోతున్నారు అని చెప్పాలి.  ఇకపోతే ఇక ఇప్పుడు టీమిండియా కు మరో రవీంద్ర జడేజా దొరికేశాడు అన్న వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా అక్షర్ పటేల్ అద్భుత ఆట తీరును కనపరిచాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఒకటి, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసుకొని అదరగొట్టాడు.

 కేఎల్ రాహుల్ సారధ్యంలో అతని ప్రదర్శన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  భారత్ తరపున మూడు ఫార్మాట్లలో కూడా క్రికెట్ ఆడాడు అక్షర్ పటేల్. ఇప్పటివరకు ఆరు టెస్ట్ మ్యాచ్ లలో ఆడి 39 వికెట్లు తీశాడు. అంతేకాదు 46 వన్డే మ్యాచ్లో 55 వికెట్లు, 37 టీ20 మ్యాచ్లలో 33 వికెట్లు తీశాడు. ఇక రవీంద్ర జడేజా గాయం కారణంగా టి20 వరల్డ్ కప్ కు దూరమైనప్పుడు అతని స్థానంలో అక్షర్ కు మాత్రమే ఆడే అవకాశం లభించింది.  ఇక అదే సమయంలో బ్యాటింగ్ లో కూడా ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. దీంతో ఇక టీమిండియా కు మరో రవీంద్ర  జడేజా దొరికాడు అంటూ కొంతమంది భారత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: