అంటే ఏంటి.. మేము టెస్టులు ఆడటం మానేయాలా : బాబర్

praveen
పాకిస్తాన్ జట్టుకు ఏకంగా సొంత గడ్డపైనే చేదు అనుభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది ఇంగ్లాండ్ జట్టు.  ఈ క్రమంలోనే అక్కడ టెస్టు సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ళ దూకుడైన ఆట తీరు ముందు పాకిస్తాన్ జట్టు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. ఇక చివరి వరకు గెలుపు కోసం పోరాడినప్పటికీ చివరికి వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు సిరీస్ కోల్పోయింది.

దీంతో పాకిస్తాన్ ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 2-0 తేడాతో అటు సిరీస్ కోల్పోవడమే కాదు మరోవైపు ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి కూడా అటు పాకిస్తాన్ నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. కాదా సుదీర్ఘబిరామం తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు 22 ఏళ్ల తర్వాత అక్కడ టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇక ఓపెనర్లు బాబర్, రిజ్వాన్  బ్యాటింగ్లో పెద్దగా చెప్పుకోలేక ప్రదర్శన చేయకపోవడంతో విమర్శలు వచ్చాయి.

 కాగా మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలో ఒక జర్నలిస్టు ఆసక్తికర ప్రశ్న వేసాడు. అభిమానుల తరపున నేను అడుగుతున్న.. బాబర్, రిజ్వాన్ టి20 ఫార్మాట్ పై మరింత దృష్టి పెట్టాలని వారు కోరుకుంటున్నారు అంటూ జర్నలిస్ట్ చెప్పాడు. అయితే ఇందుకు ఘాటుగా స్పందించాడు అసంబాబర్. అంటే మేము టెస్టులు ఆడటం మానేయాలని మీరు చెబుతున్నారా అంటూ విసుక్కున్నాడు. టెస్ట్ మ్యాచ్ సమయంలో టి20 ల ప్రశ్న ఎందుకు అన్నట్లుగా చిరాకు పడ్డాడు అని చెప్పాలి. అయితే  స్పందించిన జర్నలిస్టు.. నేను అలా అనడం లేదు.. టి20  లపై ఫోకస్ చేయాలని మాత్రమే చెబుతున్న అంటూ సంజాయిషి ఇచ్చాడు. ఇకపోతే రెండు మ్యాచ్లలో ఓడిపోయినప్పటికీ మూడవ మ్యాచ్ లో మాత్రం తప్పక విజయం సాధిస్తాము అంటూ బాబర్ అజాం చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: