బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్.. అక్షర్ కు షాక్.. ఆ ఆల్ రౌండర్ అరంగేట్రం?

praveen
బంగ్లాదేశ్ జరిగిన వన్ డే సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి వన్డే సిరీస్ ను చేజార్చుకుంది టీం ఇండియా జట్టు. కానీ ఆ తర్వాత మాత్రం నామ మాత్రమైన మూడో వన్డే మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా అప్పటివరకు రెండు విజయాలు సాధించిన ఆతిథ్య బంగ్లాదేశ్ ను మూడో వన్డే మ్యాచ్లో మాత్రం చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. ఇకపోతే ఇక అదే ఆత్మవిశ్వాసంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది టీం ఇండియా జట్టు. కాగా డిసెంబర్ 14వ తేదీన చాటోగ్రామ్ వేదిక మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ టెస్ట్ సిరీస్ కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఫేసర్ మహమ్మద్ షమీ కూడా గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యారు. దీంతో ఎంతోమంది యువ ఆటగాళ్లకు అటు భారత జట్టులో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. అయితే ఇక గత కొంతకాలం నుంచి ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు.. తొలి టెస్ట్ మ్యాచ్లో చోటు దక్కడం కష్టమే అనేది తెలుస్తుంది. అతని స్థానంలో ఇటీవల మంచి ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఆల్రౌండర్ సౌరబ్ కుమార్.. భారత జట్టు తరఫున టెస్టులలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

 ఇలా అక్షర్ పటేల్ నూ తొలి టెస్ట్ మ్యాచ్లో పక్కకు పెట్టి ఇక ఆల్రౌండర్ కోటాలో అటు సౌరబ్ కుమార్ ను తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తుందట. ఇక ఇటీవల బంగ్లాదేశ్ ఏ జట్టుతో ముగిసిన అనధికారిక టెస్ట్ సిరీస్ లో కూడా సౌరబ్ కుమార్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో  ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.  ఇకపోతే ఇక రోహిత్ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్ ను శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. అదే సమయంలో ఇక టీమిండియా ఆడబోయే టెస్ట్ సిరీస్లో పేసర్ల కోటాలో శార్దూల్ ఠాగూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్లకు చోటు దక్కే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: