మేం కూడా ఇంగ్లాండునే ఫాలో అవుతాం : కేఎల్ రాహుల్

praveen
ఇటీవల కాలంలో టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ జట్టు అనుసరిస్తున్న బజ్ బాల్ విధానం కాస్తా అటు ప్రపంచ క్రికెట్లో హార్ట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా టెస్ట్ క్రికెట్ అంటే క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఎక్కువ బంతులను వృధా చేసి ఎంతో ఆచితూచి పరుగులను చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ విధానం ప్రకారం మాత్రం ఏకంగా టెస్ట్ క్రికెట్లో కూడా దూకుడుగా ఆడుతూభారీగా పరుగులు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఇటీవలే కాలంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇక ఇలాంటి ఆట తీరుతోనే ప్రత్యర్ధులకు వణుకు పుట్టిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి రోహిత్ గాయపడటంతో కెప్టెన్గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ అటు ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ విధానం పై ప్రశంసలు కురిపించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లాండ్ అనుసరిస్తున్న వ్యూహం ఎంతో బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్. నిర్భయంగా దూకుడుగా ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆడుతున్న విధానం ప్రతి క్రికెట్ అభిమాని ఇష్టపడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ కు ఆదరణ తగ్గుతున్న తరుణంలో బజ్ బాల్ అప్రోచ్ ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. వ్యక్తిగతంగా ఇది తనను కూడా ఎంతో ఆకట్టుకుంది అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

 ఇక బజ్ బాల్ విధానం ప్రకారం ఇంగ్లాండ్ క్రికెటర్ల అటాకింగ్ స్టైల్ ఎంతో బాగుందని.. ఇక బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో కూడా తాము ఇంగ్లాండ్ ప్లాన్ ని అమలు చేస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేఎల్ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. అయితే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో నిలవాలి అంటే అటు టీమిండియా తప్పనిసరిగా టెస్ట్ సిరీస్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది అన్న విషయం తెలిసిందే.  కాగా తప్పక గెలవాల్సిన కీలకమైన సిరీస్లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: