బంగ్లాదేశ్ తో ఫస్ట్ టెస్ట్... ఇండియా తుది జట్టుపై తర్జనభర్జన !

VAMSI
టీ 20 వరల్డ్ కప్ లో దారుణంగా విఫలమైన ఇండియా తర్వాత న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ లలో పర్యటించింది. కివీస్ తో టీ 20 సిరీస్ గెలుచుకున్నా, వన్ డే సిరీస్ ను కోల్పోయింది. తాజాగా బంగ్లా పర్యటనలో మూడు వన్ డే ల సిరీస్ లో 1-2 తో ఓడిపోయి తీవ్ర అవమానకర పరిస్థితిని ఎదుర్కొంది. టీం ఇండియా పై బీసీసీఐ సైతం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రేపటి నుండి రెండు టెస్ట్ ల సిరీస్ కూడా స్టార్ట్ కానుంది. అయితే వన్ డే సిరీస్ ను గెలుచుకుని ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతుండగా, ఆఖరి వన్ డే లో ఘన విజయం సాధించి ఇండియా మరో సవాలుకు సిద్ధం అవుతోంది.
అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ గా ఉండాల్సిన రోహిత్ శర్మ గాయం కారణంగా ఆఖరి వన్ డే మరియు టెస్ట్ సిరీస్ కు దూరం అయ్యాడు. దీనితో వైస్ కెప్టెన్ గా ఉన్న కె ఎల్ రాహుల్ కెప్టెన్ గా బాధ్యతలను నిర్వహించనున్నాడు. రాహుల్ తో యంగ్ ప్లేయర్ శుబ్మాన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్ గా ఎప్పటిలాగే సీనియర్ ఆటగాడు పుజారా ఉంటాడు, తర్వాత సెకండ్ అండ్ థర్డ్ డౌన్ లో కోహ్లీ మరియు రిషబ్ పంత్ లు ఉంటారు. అల్ రౌండర్ లుగా అశ్విన్ మరియు అక్షర్ పటేల్ లను ఎంచుకునే అవకాశం ఉంది. దేశవాళీ టోర్నీలలో అద్భుతంగా రాణించిన జయదేవ్ ఉనద్కట్ , సిరాజ్ మరియు ఉమేష్ లు పేసర్లు గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఉపఖండం కాబట్టి స్పిన్ కోసం అదనపు స్పిన్నర్ ను తీసుకుంటారా లేదా అన్నది తెలియదు. ఒకవేళ తీసుకుంటే కుల్దీప్ యాదవ్ కు ఆ ఛాన్స్ దక్కవచ్చు. ఆ విధంగా జట్టు కూర్పులో బౌలర్ల విషయంలో మినహాయించి ఎందులోనూ సందేహం లేదా కన్ఫ్యూజన్ ఉండే అవకాశం లేదు. అయితే ఇండియా అభిమానులు రెండు టెస్ట్ లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి ??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: