తనపై వచ్చిన మీమ్స్ పై.. బాబర్ ఫన్నీ రిప్లై?

praveen
సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో పాపులారిటీ ఎక్కువగా ఉన్న నేపద్యంలో ఎప్పుడు క్రికెటర్లకు సంబంధించిన పోస్టులు ఇంటర్నెట్లో దర్శనమిస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లు బాగా ప్రదర్శన చేస్తూ ఎంతోమంది నేటిజన్లు క్రికెటర్లను ట్రోల్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సార్లు స్టార్ క్రికెటర్లకు సంబంధించి ఫన్నీ ట్రోల్స్ కూడా వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కి సంబంధించిన ఒక ఫోటో కాస్త సోషల్ మీడియాలో ట్రోలర్స్ చేతికి చిక్కింది.

 దీంతో ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేయడంతో ఇక ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ట్రోల్ కాస్త ఏకంగా బాబర్ అజాం అభిమానులకు  కూడా నవ్వు తెప్పించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ తో మాట్లాడుతుండగా తీసిన ఒక ఫోటోలో బాబర్ పెద్ద పొట్టతో కనిపించాడు. అయితే ఈ ఫోటోను పరిశీలించి చూస్తే తప్ప అక్కడ అంపైర్ మెరైస్ ఎరాస్మస్ ఉన్నాడని పొట్ట అతనిదే అని గుర్తించలేము  ఇక ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది.

 అయితే ఇక ఇలా బాబర్ పై వచ్చిన మీమ్ అతన్ని కూడా నవ్వించినట్లు ఉంది  ఈ క్రమంలోనే ఇటీవలే రెండో రోజు మ్యాచ్లో భాగంగా బాబర్ తనపై వచ్చిన మీమ్స్ పై సరదాగా స్పందించాడు. ఇమామ్ ఉల్ హక్ నాన్ స్ట్రైక్ వైఫ్ నుంచి బంతి విసరగా అది నేరుగా అంపైర్ పొట్టను వెళ్లి తాకింది. ఇక తనపై వచ్చిన ట్రోల్ కి స్పందించడానికి అదే సరైన సమయం అనుకున్న బాబర్ ఎంపైర్ దగ్గరకు వెళ్లి అచ్చం ట్రోల్ చేసిన ఫోటోలో ఉన్నట్లుగా మరోసారి ఫోజులు ఇచ్చి నవ్వులు పూయించాడు. ఇలా తాను కూడా తనపై వచ్చిన మీమ్ ఎంజాయ్ చేసాను అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు బాబర్ అజాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: