వావ్.. తండ్రి అయినా టీమిండియా క్రికెటర్?

praveen
సినీ సెలబ్రిటీల తో పోల్చి చూస్తే క్రికెటర్లకు సోషల్ మీడియా లో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇలా క్రికెటర్లకు సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియా లోకి వచ్చింది అంటే చాలు ఇక అది నిమిషాల వ్యవధి లో వైరల్ గా మారి పోతూ ఉంటుంది. అయితే క్రికెటర్ల ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసు కోవడానికి కూడా అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి.
 
 ఇకపోతే టీమిండియా లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న మయాంక్ అగర్వాల్ కు  సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. అభిమానులందరినీ కూడా ఆనందం లో ముంచేస్తుంది అని చెప్పాలి.  ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా.. మయాంక్ అగర్వాల్ తండ్రి అయ్యాడు. టీమిండియా ప్లేయర్ మయాంక్ అగర్వాల్ భార్య ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.  ఇక ఈ విషయాన్ని స్వయం గా మయాంక్ అగర్వాల్ తన అభిమానుల తో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు అని చెప్పాలి. కాగా ఈ మగ బిడ్డకు అయాన్ష్ అని ఒక నామకరణం చేశారు అని తెలుస్తుంది.

 మా గుండెల నిండా ప్రేమ తో అయాన్ష్ ని పరిచయం చేస్తున్నాం. ఇతను దేవుడు ఇచ్చిన ఒక బహుమతి అంటూ మయాంక్ అగర్వాల్ ఈ గుడ్ న్యూస్ ని అభిమానుల తో పంచుకున్నాడు. ఇకపోతే విరాట్ కోహ్లీ తో పాటు మరి కొంత మంది భారత క్రికెటర్లు అభిమానులకు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అతనికి కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీసన్ లో మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: