తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిసిసిఐ కీలక నిర్ణయం?

praveen
2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అటు టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. షెడ్యూల్లో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లడమే కాదు అటు భారత పర్యటనకు వచ్చే విదేశీ జట్లతో కూడా వరుసగా సిరీస్ లు ఆడబోతుంది. ఇక మూడు ఫార్మాట్లలో సిరీస్ లు ఉండడంతో టీమ్ ఇండియా ఆటగాళ్లు అందరూ కూడా ఎంతో బిజీ కానున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక స్వదేశంలో జరిగే మ్యాచ్లను ఎక్కడ నిర్వహిస్తారు అన్న విషయంపై కూడా గత కొంతకాలం నుంచి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై అటు తెలుగు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా శుభవార్త అందింది అని చెప్పాలి. కాగా ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు జనవరి రెండవ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు కూడా వరుసగా సిరీస్ లు ఆడబోతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఇక ఆయా తేదీలలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో స్వదేశంలో నాలుగు టెస్టులు, 9 వన్డేలు, ఆరు టి20 మ్యాచ్ లు ఆడబోతుంది అని చెప్పాలి. ఇక ఆయా మ్యాచ్లకు వేదిక ఎక్కడ అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే జనవరి 18వ తేదీన న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ ను హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది అన్నది తెలుస్తుంది.

 అదే సమయంలో ఇక మార్చ్ 19వ తేదీన ఆస్ట్రేలియా తో జరగబోయే మ్యాచ్ ను వైజాగ్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. ఇలా కేవలం నెలల వ్యవధిలోనే ఏకంగా తెలుగు రాష్ట్రాలలో రెండు అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతూ ఉండడంతో తెలుగు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించేందుకు ఎంతోమంది క్రికెట్ అభిమానులు కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన టికెట్లను ఎప్పుడు విక్రయిస్తారా అని ఎదురు చూడటం మొదలుపెట్టారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: