మాకు మంచి రోజులొచ్చాయి : హర్మన్ ప్రీత్ కౌర్

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏకంగా అంతర్జాతీయ టి20 ఫార్మాట్ కి వన్నె తెచ్చింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక ప్రతి సీజన్లో కూడా అంతకంతకు ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. ప్రస్తుతం ఎంతో మంది విదేశీ క్రికెటర్లు అటు ఐపిఎల్ ఆడటానికి ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. అయితే ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా తెరమీదికి వస్తున్నారు  ఇక ఇప్పుడు బీసీసీఐ మరో సరికొత్త ఐపీఎల్ కు శ్రీకారం చుట్టింది   ఏకంగా మహిళలకు కూడా అదే రీతిలో ప్రోత్సాహం అందించాలని ఉద్దేశంతో మహిళ ఐపిఎల్ నిర్వహించడానికి రెడీ అయ్యింది.

 వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మహిళల ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం ఇప్పటినుంచి సన్నాహాలను ప్రారంభించింది బీసీసీఐ. ఇక ఐదు ఫ్రాంచైజీల కొనుగోలు కోసం 400 కోట్లను ప్రాథమిక ధరగా నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీ కోసం ఎంతో మంది మహిళా క్రికెటర్లు కూడా కల్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే మహిళా ఐపీఎల్ గురించి ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

 ఐపీఎల్ టోర్నీ దేశవాళీ ప్లేయర్స్ అందరికి కూడా ఒక మంచి వేదిక అంటూ చెప్పుకొచ్చారు హర్మన్ ప్రీత్. ప్రతిభవంతులైన ప్లేయర్లకు ఐపిఎల్ ఒక చక్కటి వేదిక. ఎందుకంటే ఐపీఎల్లో విదేశీ ప్లేయర్లతో ఆడేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ అంటే ఏమిటో ఇక ఐపీఎల్ ద్వారా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఐపీఎల్ భారత్లో దేశియ, అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించిన అంతరంగాన్ని తగ్గిస్తుంది అంటూ హర్మాన్ ప్రీత్ తో చెప్పుకొచ్చింది. ఇది మహిళా క్రికెట్కు ఒక మహర్దశ అని.. మంచి రోజులు రాబోతున్నాయి అంటూ సంతోషం వ్యక్తం చేసింది హార్మన్ ప్రీత్ కౌర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: