40 ఏళ్ళ వయస్సులో.. అండర్సన్ అదరహో.. వరల్డ్ రికార్డ్?

praveen
ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ప్రస్తుతం రికార్డులను కొల్లగొట్టడంలో ఎప్పుడు ముందుంటున్నాడు అని చెప్పాలి. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఇక ఫాస్ట్ బౌలర్గా అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసినప్పటికీ తరచూ గాయాల బెడద వేధిస్తూ ఉంటుందని అంటూ ఉంటారు క్రీడ నిపుణులు. ఈ క్రమంలోనే మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే ఫాస్ట్ బౌలర్లు కేవలం తక్కువ సమయం మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు.

 అయితే సాధారణంగా క్రికెటర్లు ఎవరైనా సరే 40 ఏళ్ళ వయసులో రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అలాంటిది బౌలర్లు అయితే అంతకుముందే ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకుంటారు. కానీ ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మాత్రం 40 ఏళ్ళ వయసులో కూడా ఇంకా తనలో ఆడే సత్తా ఉంది అని ప్రతి మ్యాచ్లో నిరూపిస్తున్నాడు. రికార్డులు కొల్లగొట్టడంలో ముందు ఉంటాడు. యువ బౌలర్లకు సైతం సాధ్యం కానీ ఎన్నో అరుదైన రికార్డులను సృష్టిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఇలా ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను కొల్లగొట్టిన జేమ్స్ అండర్సన్ ఇక ఇటీవలే మరో సరి కొత్త రికార్డును సాధించాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో రెండవ వికెట్ తీసిన జేమ్స్ అండర్సన్ ఏకం గా 957 వికెట్లు సాధించాడు.  తద్వారా భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే 956 వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు.  అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా అండర్సన్ నిలిచాడు. ఈ లిస్టులో మురళీధరన్ 1347 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ 1001 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: