ఏంటి.. ధావన్ పరిస్థితే.. రోహిత్ కు రానుందా?

praveen
ప్రపంచ క్రికెట్లో ఎంతో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న టీమిండియా అటు ఐసీసీ టోర్నీలలో మాత్రం విఫలమవుతున్న తీరు అభిమానులు అందరిని కూడా నిరాశలో ముంచేస్తుంది అన్న విషయం తెలిసిందే. దాదాపు గత తొమ్మిదేళ్ల నుంచి కూడా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది టీమిండియా జట్టు. చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ని కైవసం చేసుకుంది టీం ఇండియా.. ఇక అప్పటినుంచి అటు టీమ్ ఇండియాను ప్రతి ఐసీసీ టోర్నీలో కూడా బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది అని చెప్పాలి.
 కొన్ని కొన్ని సార్లు ఫైనల్ వరకు వెళ్లి ఇక ట్రోఫీ గెలవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇలా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్ వరకు టీమిండియా ఆడిన ప్రతి ఐసీసీ టోర్నీలో కూడా అభిమానులను నిరాశ పరుస్తూనే ఇంటి ముఖం పట్టింది. కాగా వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ ను బీసీసీఐ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఇక ఇటీవల టి20 వరల్డ్ కప్ లో వైఫల్యం నేపథ్యంలో  జట్టును ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకుంది.

 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి జట్టులో అనూహ్యమైన   మార్పులు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెలక్షన్ కమిటీ పై వేటు వేసిన బీసీసీఐ అధికారులు త్వరలో టి20 నుంచి సీనియర్లను కూడా తప్పించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. అంతేకాకుండా వన్డేలు టెస్ట్ లకు మాత్రమే సీనియర్లను  పరిమితం చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నా రోహిత్ శర్మ టి20 నుంచి తప్పించి వన్డే టెస్ట్ లకు మాత్రమే పరిమితం చేయడం ఖాయమని తెలుస్తుంది  శిఖర్ ధావన్ ను ఎలా అయితే వన్డేలకు మాత్రమే  వాడుకుంటున్నారో రోహిత్ ని కూడా రానున్న రోజుల్లో ఇలా వన్డేల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందట. టి20 లో దూకుడుగా ఆడక పోవడం టెస్టుల్లో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోవడం.. మరోవైపు వయసు కూడా పెరిగిపోవడంతో బిసిసిఐ ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: