వరల్డ్ కప్ లో ఆడటానికి.. అతను అసలైన అర్హుడు : దినేష్ కార్తీక్

praveen
మొన్నటి వరకు భారత జట్టులో చోటు కోల్పోయి ఎన్నో రోజులుగా ఛాన్స్ కోసం ఎదురుచూసిన  ధావన్ గత కొంతకాలం నుంచి మాత్రం టీమ్ ఇండియాలో రెగ్యులర్గా ఛాన్స్ దక్కించుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న ప్రతిసారి కూడా టీమిండియా వన్డే జట్టుకు కెప్టెన్సీ వహిస్తూ తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంతే కాదు తన కెప్టెన్సీ వ్యూహాలతో టీమ్ ఇండియాకు విజయాన్ని కూడా అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఒక ఆటగాడిగా కూడా మంచి ఫామ్ కనబరుస్తూ అటు శిఖర్ ధావన్ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే శిఖర్ ధావన్ ఫామ్ లో ఉండడం పై ఇటీవల టీమిండియా వెటరన్  బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు.

 వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్  సెలెక్టర్లకు ఒక మంచి ఆప్షన్ గా మారతాడని అభిప్రాయపడ్డాడు. నాకెందుకు రానున్న ప్రపంచ కప్ లో శిఖర్ ధావన్ ఓపెనర్ గా ఆడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే 30 ఏళ్లు దాటిన ఈ ఆటగాడిని పక్కన పెట్టడం చాలా తేలిక. కానీ సెలక్టర్లు అతడు చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ కు కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వడానికి సైతం సెలెక్టర్లు ఆసక్తి చూపించారు. ఇక సందర్భానికి తగినట్లుగా తనను తాను మలుచుకునే వ్యక్తి శిఖర్ ధావన్. 2019 ప్రపంచ కప్ లో గాయానికి ముందు అతను అద్భుతం ప్రదర్శన చేశాడు. మధ్యలో ఫామ్ కోల్పోతే తప్ప జట్టులో కొనసాగడానికి అతను పూర్తిగా అర్హుడు అంటూ దినేష్ కార్తీక్ ప్రశంసించాడు.

 ఎందుకంటే శిఖర్ ధావన్ కి గేమ్ ప్లాన్ బాగా తెలుసు.  ఇక ఎక్కడ క్రికెట్ ఆడిన కూడా క్రీజు ను ఎంతో చక్కగా వినియోగించుకుంటాడు. అన్నిటికీ మంచి ముఖ్యంగా భారత టి20 లీగ్ ముందు అతను కోరుకున్నట్లుగా అతనికి మరో మంచి అవకాశం దొరుకుతుంది అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.  అయితే ప్రస్తుతం టీమిండియా కు తాత్కాలిక కెప్టెన్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కూడా ఎంపిక అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: