జట్టులో లేకపోతే ఏంటి.. సంజు చేసిన పనికి అందరూ ఫిదా?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్ కి ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళిన భారత జట్టులో ఛాన్స్ దక్కింది అని చెప్పాలి. అయితే భారత జట్టులో అయితే ఎంపిక అయ్యాడు. కానీ తుది జట్టులో మాత్రం సంజూ శాంసన్ ఎక్కువగా కనిపించడం లేదు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టి20 సిరీస్ లో మాత్రం సంజు శాంసన్ ను అస్సలు పరిగణలోకి తీసుకోలేదు. ఒక్కసారి కూడా అతనికి తుది జట్టులో ఛాన్స్ దక్కలేదు అని చెప్పాలి.

 ఇకపోతే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్తో ఆడుతున్న వన్ డే సిరీస్లో అయిన సంజూ శాంసన్ కు చోటు దక్కుతుందని అందరు భావించారు.  అనుకున్నట్లుగానే మొదటి వన్డే మ్యాచ్లో సంజూ శాంసన్ అవకాశం దక్కించుకున్నాడు. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే అతను మంచి ప్రదర్శన చేసినప్పటికీ రెండో వన్డే మ్యాచ్లో మాత్రం అతని పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సంజూ శాంసన్ కి అన్యాయం చేస్తున్నారు అంటూ ఎంతో మంది అభిమానులు కూడా ఏకంగా టీమిండియ యాజమాన్యం పై  దుమ్మెత్తి పోస్తున్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల ఏకంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేయగా అది వైరల్ గా మారిపోయింది.  సంజు శాంసన్ జట్టులో భాగం కాకపోయినప్పటికీ ఏకంగా అతను చేసిన పని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రెండో వన్డే మ్యాచ్ సమయంలో రెండు మూడు సార్లు వర్షం కురవడంతో ఇబ్బంది ఏర్పడింది. ఇక అటు గ్రౌండ్లో కవర్లను కప్పెందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలోనే గ్రౌండ్లోకి చేరుకున్న సంజూ శాంసన్ సిబ్బందికి సహాయం చేసి కవర్లను కప్పాడు. ఇలా ఒక స్టార్ క్రికెటర్ అయినప్పటికీ సంజూ శాంసన్ మాత్రం గ్రౌండ్ లోని సిబ్బందికి హెల్ప్ చేయడంతో.. జట్టులో లేకపోతే ఏంటి నీ మంచిమనసుతో అందరి హృదయాలను గెలుచుకున్నావు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: