అది కేవలం ధోనీకి మాత్రమే సాధ్యం : రియాన్ పరాగ్

praveen
మహేంద్ర సింగ్ ధోని టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తర్వాత ఇక ఫినిషర్ అనే పదానికి అసలు సిసలైన అర్థం చెప్పాడు అని చెప్పాలి. ఆరు, ఏడు స్థానాలలో బ్యాటింగ్ చేయడానికి వచ్చే మహేంద్ర సింగ్ ధోని ఇక ఎంతో ఒత్తిడి సమయంలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ భారత జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ గా కూడా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 అయితే మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమ్ ఇండియాకు ఇలా ఫినిషర్ పాత్ర ఎంతగానో ఇబ్బంది పెట్టింది. అయితే ధోని లాగా ఫినిషింగ్ చేసేందుకు ఆ స్థానంలో ఎంతోమంది ఆటగాళ్లని మార్పులు చేసినప్పటికీ ఎవరూ కూడా ధోని స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు అని చెప్పాలి.. రెండు మూడు మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేసిన ఆ తర్వాత మాత్రం ఇక పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. మొన్నటికి మొన్న కొన్ని మ్యాచ్లలో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించి ఇక ధోని స్థానాన్ని భర్తీ చేశాడు అనిపించినప్పటికీ వరల్డ్కప్ లో మాత్రం చేతులెత్తేసాడు.

 ఈ క్రమంలోనే ఫినిషర్ అంటే ధోనీనే అంటూ ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు కురిపించగా.. ఇక యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ సైతం ధోని ఫినిషింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ఫార్మాట్లో ఆరు, ఏడు స్థానాల్లో కూడా బ్యాటింగ్ కు వచ్చి దూకుడుగా ఆడటం కేవలం ధోనీకి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చాడు. ధోని మాత్రమే ఇందులో ప్రావీణ్యం సంపాదించాడు అంటూ తెలిపాడు. అందుకే ధోని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాడు అంటూ రియాన్ పరాగ్ వ్యాఖ్యానించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ తనపై ఉంచిన నమ్మకాన్ని ఆటతీరుతో ప్రతిఫలం ఇస్తానని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: