క్రికెట్లో.. అరుదైన ప్రపంచ రికార్డ్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు ఎప్పుడు రికార్డుల వేటలో ముందుంటారు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎన్నో అరుదైన రికార్డులను కొల్లగొడుతూ ఉంటారు. మూడు ఫార్మాట్ లో కూడా ఏకంగా తమ ప్రదర్శనతో మ్యాజిక్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవరైనా ఆటగాడు కీలకమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు ఇక అతని గురించి సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఆ అరుదైన రికార్డు గురించి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ టీమిండియా మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ జరగగా.. ఈ టి 20 సిరీస్ ను టీమిండియా కైవసం  చేసుకుంది. కాగా ఇక వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక నేడు కీలకమైన పోరు జరగబోతుంది. అయితే ఇటీవల భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరుస సిరీస్లలో భాగంగా మంచి ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ బౌలర్ టీమ్ సౌదీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.

 టెస్ట్ ఫార్మాట్లో 300, వన్డే ఫార్మాట్లో 200, టీ20 ఫార్మాట్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఘనత సృష్టించాడు న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌదీ. ఇప్పటివరకు అతడు టెస్టుల్లో 347 వికెట్లు సాధించగా వన్డే ఫార్మాట్ లో 202 వికెట్లు సాధించాడు. ఇక పొట్టి ఫార్మాట్లో 100 వికెట్లు సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవల భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో శిఖర్ ధావన్ వికెట్ తీయడం ద్వారా ఇక వన్డేలలో అరుదైన రికార్డు సాధించాడు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక వన్డే ఫార్మాట్లో 200 వికెట్లు తీసిన ఐదో న్యూజిలాండ్ బౌలర్గా మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: