స్పీడ్ గన్ ఉమ్రాన్.. వేగంలో తగ్గేదేలే?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టులో స్పీడ్ గన్ గా కొనసాగితు ఉన్నారు ఉమ్రాన్ మాలిక్. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మంచి ప్రదర్శన చేసి ఒక్కసారిగా సెలెక్టర్లు చూపును ఆకర్షించాడు ఈ కాశ్మీర్ బౌలర్. ఏకంగా టీమిండియాలో ఉన్న స్టార్ బౌలర్లకు సైతం సాధ్యం కాని విధంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులను విసిరి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ చూపును తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని బౌలింగ్ వేగం చూసిన తర్వాత అతనే ఫ్యూచర్ స్టార్ అని ఎంతో మంది క్రికెటర్లు కూడా ధీమా వ్యక్తం చేశారు.

 వెంటనే అతన్ని టీమిండియాలోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ కూడా చేశారు అని చెప్పాలి. అయితే ఇలా తక్కువ సమయంలోనే టీమిండియాలోకి కూడా అరంగేట్రం చేశాడు. దీంతో అతనికి తిరుగు ఉండదు అని అందరూ భావించారు. కానీ బౌలింగ్లో వేగం ఉన్నప్పటికీ సరైన లైన్ అండ్ లెన్త్ వేయకపోవడంతో భారీగా పరుగులు సమర్పించుకుని విమర్శలు ఎదుర్కొన్నాడు. తర్వాత కాలంలో జట్టులోకి ఎంత స్పీడ్ గా వచ్చాడో.. అంతే స్పీడ్ గా జట్టులో స్థానం కోల్పోయాడు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే టీమ్ ఇండియా లో ఎన్నో రోజులుగా స్థానం కోసం ఎదురు చూస్తున్న ఉమ్రాన్ మాలిక్కు ఇక ఇటీవల  న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్లో అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టాడు ఉమ్రాన్ మాలిక్. ఏకంగా తన బలంతో కీలకమైన రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా తన మొదటి ఓవర్ లోనే 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరిన ఉమ్రాన్ మాలిక్.. 15 ఓవర్ లో రెండో బంతిని 153.1 కిలోమీటర్లకు పైగా వేగంతో విసిరి అందరినీ ఔరా అనిపించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: