టాస్ ఓడిన భారత్.. మ్యాచ్ నెగ్గుతుందా?

praveen
ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా.. ఇటీవల టి20 సిరీస్ ముగించింది అన్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియమించబడ్డాడు. ఈ క్రమంలోనే ఇక హార్దిక్  సారథ్యంలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు  టి 20 సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ లో ఘనవిజయాన్ని సాధించింది. అయితే అంతకుముందు మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం.. ఇక చివరి మ్యాచ్ కూడా వర్షం ప్రభావం కారణంగా టై గా ముగియడంతో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా సిరీస్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.

 ఇలా న్యూజిలాండ్ జట్టుకు సొంత గడ్డపైనే ఊహించని షాక్ ఇచ్చింది టీం ఇండియా. ఇలా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో శుభారంభం చేసిన టీమిండియా ఇక నేటి నుంచి అటు వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ కెప్టెన్సీ లో వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ తో తలబడేందుకు సిద్ధమవుతుంది టీమ్ ఇండియా జట్టు. కాగా ఉదయం ఏడు గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లే వన్ డే సిరీస్ లో కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవరికి తుది జట్టులో అవకాశం దక్కుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

 ఇకపోతే టి20 సిరీస్ లో వర్షం ఇబ్బందులు సృష్టించినట్లుగానే ఇక వన్డే సిరీస్ లో కూడా వర్షం కారణంగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇబ్బందులను ఎదుర్కొని ఎవరు పై చేయి సాధించి సిరీస్లో విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీ20 సిరీస్ జోరును కొనసాగిస్తూ వన్డే సిరీస్ కూడా గెలుచుకోవాలని చూస్తుంది శిఖర్ ధావన్ జట్టు. అదే సమయంలో కనీసం వన్ డే సిరీస్లో అయిన విజయం సాధించి సొంత గడ్డపై పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది కివీస్ జట్టు. దీంతో ఎంతో హోరాహోరీ పోరు జరగబోతుంది. అయితే ఇటీవల మ్యాచ్ లో భాగంగా టాస్ నెగ్గిన న్యూజిలాండ్ జట్టు భారత్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: