షాకింగ్ : స్టార్ క్రికెటర్ పై.. ఏడాది పాటు నిషేధం?

praveen
ఇటీవల కాలం లో శ్రీలంక క్రికెట్లో ఎవరూ ఊహించనీ విధంbగా అనూహ్యమైన ఘటనలు వెలుగు లోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా శ్రీలంక జట్టు లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతూ ఉన్న వారు వరుసగా నిషేధానికి గురవుతూ ఉండడం సంచలనంగా మారి పోయింది. గతం లో కఠినమైన కరోనా వైరస్ నిబంధనలు అమలు లో ఉన్న సమయం లో కొంత మంది క్రికెటర్లు ఏకంగా నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా నిషేధానికి గురయ్యారు అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో భాగం గా ఏకంగా శ్రీలంక జట్టు లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న ధనుష్క గుణతిలక సైతం ఒక అమ్మాయిపై అత్యాచారం చేయడం తో చివరికి  అరెస్టు చేయ బడ్డాడు.

 అయితే ధనుష్క గుణతిలక చివరికి అరెస్ట్ కావడం తో అతన్ని మూడు ఫార్మాట్ల నుంచి కూడా నిషేధిస్తున్నట్లు అటు లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇలా ధనుష్క గుణ తిలకపై ఏర్పడిన నిషేధం గురించిన చర్చ ముగిసే లోపే ఇక ఇప్పుడు మరో ఆటగాడు నిషేధానికి గురయ్యాడు అన్నది తెలుస్తుంది. శ్రీలంక జట్టు లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు చమిక కరుణరత్నే. ఒకవైపు బ్యాటింగ్లో మరో వైపు బౌలింగ్ లో కూడా అదరగొడుతున్నాడు అని చెప్పాలి.

 ఇలాంటి స్టార్ క్రికెటర్ పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెందిన పలు అగ్రిమెంట్లను అతను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ముగ్గురు సభ్యుల తో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరగ్గా.. ఇక నిబంధనలు ఉల్లంఘించినట్లు అతను అంగీకరించాడు.. దీంతో అతనిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు... 5000 డాలర్ల జరిమానా కూడా విధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: