హార్దిక్ పట్టించుకోలేదు.. కనీసం ధావన్ అయినా చాన్స్ ఇస్తాడా?

praveen
టి20 వరల్డ్ కప్ లో వైఫల్యం తర్వాత జట్టులో అనూహ్యమైన మార్కులు ఉంటాయని అందరూ ఊహించారు. ఈ క్రమంలోనే జట్టులో సీనియర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అశ్విన్ సహా మరి కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి ఇక టీమిండియా టి20 జట్టును యువ ఆటగాళ్ళతో నింపేస్తారని అందరూ భావించారు. ఇక అనుకున్నట్లుగానే సీనియర్లకు రెస్ట్ ఇచ్చి న్యూజిలాండ్ పర్యటన కోసం యువ ఆటగాడు హార్థిక్ ను కెప్టెన్ గా నియమించి ఎంతోమంది  యంగ్ ప్లేయర్లను జడ్డులోకి ఎంపిక చేశారు.

 గత కాలం నుంచి టీం లో స్థానం కోల్పోయిన ఎంతో మంది ప్లేయర్లు ఇక న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మళ్ళీ తుదిజట్టులోకి వస్తారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా సైతం వరల్డ్ కప్ లో విఫలమైన భువనేశ్వర్ కుమార్ రిషబ్ పంత్ లతోనే ముందుకు వెళ్లాడు   అదృష్టవశాత్తు 1-0 తేడాతో ఇక సిరీస్ కైవసం చేజార్చుకున్నాడు. జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఉమ్రాన్ మాలిక్, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్ళను అస్సలు పట్టించుకోలేదు పాండ్యా.

 దీంతో ఈ ఇద్దరు క్రికెటర్ల అభిమానులు అందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోయారు అని చెప్పాలి. ఆటగాళ్ళకు పెద్దపీట వేస్తాడు అనుకుంటే మళ్ళీ సీనియర్లకు అవకాశం ఇవ్వడమేంటి అని అందరూ విమర్శలు గుప్పించారు. అయితే రేపటి నుంచి అటు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. టి20 సిరీస్ లో ఉన్న ఆటగాళ్లు అటు వన్ డే సిరీస్లో దాదాపుగా అందరూ ఉన్నారు. అయితే హార్దిక్ పాండ్యా ఎలాగో సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. కనీసం శిఖర్ ధావన్ అయినా అటు ఈ ఇద్దరు ప్లేయర్లకు అవకాశం ఇస్తే తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు మరో ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: