వారెవ్వా.. సూర్య.. మళ్లీ టాప్ లోనే?

praveen
గత కొంతకాలం నుంచి విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్. సాధారణంగా టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టిస్తారు అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఎంత విధ్వంసం సృష్టించినప్పటికీ ఐసీసీ విడుదల చేసే టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం దక్కించుకోవడం మాత్రం చాలా మందికి అసాధ్యం అని చెప్పాలి. ఇలా అగ్రస్థానం కోసం ఎంతలా మంచి ప్రదర్శన చేయాలని ప్రయత్నించిన చివరికి కొంతమందికి మాత్రమే ఇలా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం సాధ్యమవుతూ ఉంటుంది.

 కొంతమంది ఏకంగా నెంబర్ వన్ స్థానం కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ ఉంటారు. కానీ టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ మాత్రం భారత జట్టులోకి వచ్చిన ఏడాది కాలంలోనే బ్యాట్మెన్ల  ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కేవలం ఒక్కసారి పొరపాటున సొంతం చేసుకోవడం కాదు తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఇక నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు అని చెప్పాలీ. ఇప్పటికే ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ సూర్య కుమార్ రెండుసార్లు నెంబర్ వన్ స్థానం నిలబెట్టుకున్నాడు.

 ఇక ఇప్పుడు మరోసారి మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఇక తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం గానే ఉంచుకున్నాడు అని చెప్పాలి. ఎనిమిది వందల తొంబై పాయింట్లు తో సూర్య కుమార్ యాదవ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ గత వారం 11వ స్థానంలో ఉండగా ఇక ఈ వారం మాత్రం 13వ స్థానంలోకి పడిపోయాడు. ఆల్ టైం టి20 ర్యాంకింగ్స్ లో డేవిడ్ మల్లాన్ మొదటి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 3 సూర్యకుమార్ 5 కేఎల్ రాహుల్ 10 స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: