అలాంటి సీక్రెట్ ఏమీ లేదు : సూర్య కుమార్

praveen
సూర్య కుమార్ యాదవ్.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రస్తుతం స్టార్ బౌలర్ల వెన్నులో కూడా వణుకు పుడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ సృష్టిస్తున్న విధ్వంసం అలాంటిది. తనకు బంతులు విసురుతుంది స్టార్ బౌలర్ల లేకపోతే యువ ఆటగాళ్ల అన్న విషయాన్ని అతను పట్టించుకోవడం లేదు. క్రేజ్ లోకి వచ్చామా.. బౌండరీలు కొట్టామా. స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించామా అన్నదే ముఖ్యం అన్న విధంగా అతని బాటిల్ తీరు కొనసాగుతూ ఉంది.

 టీమిండియా ఎలాంటి ప్రత్యర్థి తో మ్యాచ్ ఆడిన కూడా అటు సూర్యకుమార్ బ్యాటింగ్ తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు. దూకుడు అయిన బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన సూర్య కుమార్ మైదానం నలువైపులా అలవోకగా షాట్లు ఆడుతూ చెలరేగిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. మిగతా బ్యాట్స్మెన్లు సింగిల్స్ తీయడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో కూడా సూర్య సిక్సర్లతో చెలరేగిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా రెండవ టి20 లో మరోసారి 51 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయమైన సెంచరీ చేశాడు సూర్య కుమార్.

 ఈ క్రమంలోనే మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక తన బ్యాటింగ్ సీక్రెట్ ఏంటి అన్న విషయంపై ఇటీవల సూర్య కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. వర్షం ఆటంకం కలిగించినప్పటికీ రెండవ టీ20 మ్యాచ్ పూర్తిస్థాయిలో జరగడం ఆనందాన్ని కలిగించిందంటూ చెప్పుకొచ్చాడు. పక్క ప్రణాళికలతో బ్యాటింగ్కు వెళ్లానని.. కనీసం 12 ఓవర్ నుంచి దూకుడుగా ఆడాలని నిర్ణయించుకుని.. ఇక ఆ దిశగానే సక్సెస్ అయినట్లు తెలిపాడు. ఇక తన షాట్ల వెనుక రహస్యం ఏమీ లేదని.. ఎంజాయ్ చేస్తూ షాట్లు కొడతానని.. ఎప్పుడు గేమ్ ప్లాన్ అమలుపైన తన దృష్టి ఉంటుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: