ఏం కొట్టాడు రా బాబు.. 19 బంతుల్లో 61 రన్స్?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగింది టీం ఇండియా జట్టు. అయితే ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్లో టి20 సిరీస్ తో పాటు ఇక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది. అయితే ప్రస్తుతం ఇక న్యూజిలాండ్ జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా న్యూజిలాండ్ మధ్య రెండవ టి20 మ్యాచ్ జరిగింది.

 అయితే అంతకుముందు ఇక ఇరు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఇక వర్షం ప్రభావం కారణంగా మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండానే చివరికి వాయిదా పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రెండో టి20 మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు తెరమీదకి రాగా.. ఇక వర్షం కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ ఎట్టకేలకు మ్యాచ్ మాత్రం జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 51 బంతుల్లో 111 పరుగులు చేశాడు సూర్య కుమార్ యాదవ్.

 దీంతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి. అయితే ఒకవేళ సరైన సమయంలో సూర్య కుమార్ యాదవ్ గేర్ మార్చకపోతే మాత్రం టీమిండియా కష్టాల్లో పడేది అని చెప్పాలి. ఎందుకంటే తొలుత 32 బంతుల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు సూర్య కుమార్ యాదవ్. కానీ ఆ తర్వాత 19 బంతుల్లో మాత్రం ఏకంగా 61 పరుగులు రాబట్టాడు అని చెప్పాలి. అది కూడా 321.05 స్ట్రైక్ రేటుతో పరుగులు రాబట్టడం గమనార్హం. అయితే మిగతా భారత టీమ్ మొత్తం 69 బంతుల్లో 69 పరుగులు చేసింది. అయితే సూర్య ఒక్కడే 7 సిక్సర్లు కొడితే ఇక మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కలిసి రెండు సిక్సర్లు మాత్రమే కొట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: