వణుకు పుట్టిస్తున్నాడు.. ఇలాంటి బౌలరే టీమిండియాకు కావాలి?

praveen
ఇటీవలే వరల్డ్ కప్ సమయంలో కీలక బౌలర్గా ఉన్న బుమ్రా జట్టుకు దూరం కావడం అతను లేకుండానే అటు టీమిండియా వరల్డ్ కప్ లో బరిలోకి దిగడంతో టీమిండియాలో బౌలింగ్ విభాగం ఎంత బలహీనంగా ఉందో అర్థమైంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి బౌన్సి పిచ్ లపై ఇక తమ ఫాస్ట్ బౌలింగ్ తో మెరుపులు మెర్పించగల బౌలర్ టీమిండియాలో కనిపించనే లేదు అని చెప్పా.లి అయితే ఇక అటు కొన్ని మ్యాచ్లలో అర్షదీప్ సింగ్ బాగా రాణించినప్పటికీ.. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం అతను చేతులెత్తేశాడు. దీంతో టీమ్ ఇండియాకు పదునైన పేస్ బౌలర్లు కావాలి అని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 అయితే ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్లు అటు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నప్పటికీ సరైన లైన్ అండ్ లెంత్ లేకపోవడంతో పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక నటరాజన్ కూడా అటు ఆస్ట్రేలియా పిచ్ లకు బాగా సరిపోతాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ఒక ఆణిముత్యం లాంటి బౌలర్ ప్రస్తుతం ప్రేక్షకుల కంటపడ్డాడు అని చెప్పాలి. అతనే జమ్మూ కాశ్మీర్ కు చెందిన వసీం బషీర్.

 దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్న బషీర్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు వణుకు పుట్టిస్తున్నాడు అని చెప్పాలి. ఇక తన పదునైన ఫేస్ బౌలింగ్ తో బౌన్సర్లను విసురుతూ బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతని ఫేస్ బౌలింగ్ చూస్తే మాత్రం 22 ఏళ్ల వసీం బషీర్ కు మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అండర్ 25 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ యువ ఫేసెర్. ఇక అతని బౌలింగ్ కు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.  దీంతో వెంటనే భారత్ సెలెక్టర్లు అతన్ని గుర్తించాలి అంటూ ఎంతో మంది అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ మినీ వేలంలో వేలంలో అతన్ని ఏదైనా జట్టు కొనుగోలు చేసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: