సూర్య, శ్రేయస్.. కోహ్లీ స్థానంలో అతనే బెటర్ : అశ్విన్

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత అటు కోహ్లీ, రోహిత్, రాహుల్ లాంటి కీలక ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం యువ ఆటగాళ్లను జట్టులో చేర్చి ఇక హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలను అప్పగించి అటు న్యూజిలాండ్ పర్యటనకు పంపించింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక కివీస్ తో  ఆడబోయే వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ సారధ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడు అని చెప్పాలి.. ఇక ఇప్పటికే ఇరుజట్ల మధ్య టి20 సిరీస్ ప్రారంభమైంది. నిన్న వెల్డింగ్టన్ వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది.

 ఇదిలా ఉంటే ప్రస్తుతం జట్టులో రెగ్యులర్ ఓపెనర్లుగా ఉన్న రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ ఇక వన్ డౌన్లో బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులో లేని నేపథ్యంలో ఈ ముగ్గురి స్థానాన్ని భర్తీ చేయబోయే యువ ఆటగాళ్ళు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక  ఆ ముగ్గురు స్థానాలలో ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది తమ అభిప్రాయాలను కూడా రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. టీం ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే విషయంపై స్పందించాడు.

 విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయ సయ్యద్ లేదా సూర్య కుమార్ యాదవ్ లలో ఎవరు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అన్న విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. శ్రేయస్ అయ్యర్ వన్ డౌన్ లో బ్యాటింగ్కు వస్తేనే ఉత్తమం. ఇక సూర్యకుమార్ తన నాలుగో స్థానంలోనే ఆడాలి. ఇక ఆ స్థానాన్ని సూర్యకుమార్ కోసం లాక్ చేసేయొచ్చు. అయితే సూర్యకుమార్ను మూడవ స్థానంలో పంపించడం అనేది ఉద్వేగంతో తీసుకునే నిర్ణయమే అవుతుంది. అందుకే ఆ స్థానానికి కేవలం శ్రేయస్ అయ్యర్ మాత్రమే కరెక్ట్. ఇక ఓపెనర్గా రిషబ్ పంత్ ను పంపిస్తే ఐదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ కీలక ఆటగాడిగా మారతాడు. ఎందుకంటే అతను లెఫ్ట్ హ్యాండర్ కావడమే ఇందుకు కారణం. ఇక మిడిల్ ఆర్డర్లో ఇంకెవరు కూడా ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్లు లేరు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: