వావ్.. సూర్య కుమార్ కు ప్రమోషన్?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా తరఫున అత్యుత్తమమైన ప్రతిభ కనబరుస్తూ తన బ్యాటింగ్తో ఎంతో మంది మాజీ ఆటకాళ్లను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు  సూర్య కుమార్ యాదవ్. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. మైదానం నలవైపులా ఎంతో అలవోకగా షాట్లు ఆడుతూ ఇక తనకు తిరుగులేదు అని నిరూపిస్తూ ఉన్నాడు. ఇక స్టార్ బౌలర్లు అయినా సరే లెక్క చేయకుండా భారీ బౌండరీలు కొడుతూ తన ఆట తిరుతో మిస్టర్ 360 అనే బిరుదును అందుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో ఏకంగా నాలుగవ స్థానంలో నమ్మదగిన ఆటగాడిగా మారిపోయాడు సూర్య కుమార్ యాదవ్.

 అందరితో పోల్చి చూస్తే జట్టులోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా ఎదిగాడు అని చెప్పాలి. అయితే నవంబర్ 18 నుంచి భారత జట్టు న్యూజిలాండ్ లో తొలి టీ20 సిరీస్ ఆడబోతుంది. రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఇక ఈ టి20 సిరీస్ కు సారధ్య బాధ్యతలు వహించబోతున్నాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న నేపథ్యంలో కొత్త ఓపెనింగ్ జోడి ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో జరగబోయే టి20 సిరీస్ లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ కు ప్రమోషన్ రాబోతుంది అన్నది తెలుస్తుంది. ఓపెనర్లుగా శుభమన్ గిల్ తో పాటు నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేసే సూర్య కుమార్ యాదవ్ ను కూడా ఓపెనర్ గా పంపాలి అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం  అయితే ఇప్పటికే శుభమన్ గిల్ కు అటు వన్డేలతో పాటు ఐపీఎల్ లో కూడా ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ ఏడాది మొదట్లో కొన్ని మ్యాచ్లలో ఓపెనర్ గా తన సత్తా చూపించాడు అన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఓపెనర్ గా సూర్య ఎలా రానిస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: