మహిళపై కుక్క దాడి.. ఎన్ని లక్షల పరిహారం వచ్చిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కలు కాస్త రెచ్చిపోతున్నాయి అని చెప్పాలి. ఏకంగా మనుషులపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరుస్తూన్న ఘటనలు ప్రతి ఒక్కరిని పెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇక వెళ్లే దారిలో ఎక్కడైనా వీధి కుక్కలు  ఉన్నాయి అంటే చాలు ప్రతి ఒక్కరు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇటీవల గురుగ్రామ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా కుక్క దాడిలో దారుణంగా గాయాల పాలైన ఒక మహిళకు ప్రస్తుతం ఉపశమనం లభించింది. ఏకంగా రెండు లక్షల మధ్యంతర పరిహారాన్ని ఇవ్వాలి అంటూ గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ నీ వినియోగదారుల వివాదాలు పరిష్కార వేదిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

 అయితే ఈ రెండు లక్షల పరిహారం మొత్తాన్ని కూడా ఆ కుక్క యజమాని నుంచి వసూలు చేయవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆగస్టు 11వ తేదీన స్థానికంగా ఉన్న ఇళ్లల్లో పని చేసే మున్ని అనే మహిళ తన కోడలితో కలిసి పనికి వెళుతుంది. ఇలాంటి సమయంలోనే పక్క నుంచి వెళ్తున్న వినీత్ చికారా అనే వ్యక్తికి సంబంధించిన కుక్క ఆమెపై దాడికి పాల్పడింది. ఈ క్రమంలోనే తల ముఖంపై తీవ్రంగా  గాయపరిచింది. దీంతో వెంటనే ఆమెను గురు గ్రామ్ లో ఉన్న సివిల్ ఆసుపత్రికి తరలించారు.

 అయితే మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై సివిల్ లైన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు  అయితే దాడి చేసిన కుక్క జాతిని ఫీట్ బుల్ అని తెలుస్తుంది..  ఇక సదరు కుక్క యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక కుక్కను తీసుకోవడంతో కుక్కను సొంతం చేసుకున్న వినీత్ చీకరా లైసెన్స్ రద్దు చేయాలని ఫోరం ఎంసిజి ని ఆదేశించింది. అయితే 11 విదేశీ జాతులను నిషేధించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అంతేకాదు  పెంపుడు కుక్కల కోసం మూడు నెలల్లో పాలసీలు రూపొందించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది ఫోరం. డిగో అర్జెంటినో  వంటి కుక్క జాతిని పెంపుడు కుక్కగా పెంచుకుంటున్న ఆ సదరు వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: