ఐపీఎల్ : వీళ్లు లేకుండా టోర్ని ఊహించగలమా?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయింది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంతలా ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని దేశాల క్రికెటర్లను ఒకచోట చేర్చి ఇక అభిమానులందరికీ కూడా ప్రతి ఏటా క్రికెట్ ను ఒక పండుగలాగా నిర్వహిస్తూ ఉంటుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అందుకే ప్రపంచ క్రికెట్ లో ఏ దేశీయ లీగ్ కి లేనంతగా అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పాలి. అంతేకాదు ప్రపంచ క్రీడలలో రెండవ రిచేస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతుంది ఐపీఎల్.

 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరు చెప్పగానే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా కొంతమంది ముఖాలు ఇక కళ్ళముందు తేలియాడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్ళు ఇక ఐపీఎల్ కు వన్నెతెచ్చిన క్రికెటర్లుగా నిలిచారు అని చెప్పాలి. ఇక అలాంటి క్రికెటర్లు లేకుండానే ఇక ఇప్పుడు 2023 ఐపీఎల్ సీజన్ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఇటీవలే ముంబై ఇండియన్స్ ప్లేయర్ కిరణ్ పోలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక అతని రిటైర్మెంట్ తో ఫాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే మిస్టర్ ఐపిఎల్ గా పేరు సంపాదించుకున్న సురేష్ రైనా ఐపీఎల్ లో మిస్టర్ 360 ప్లేయర్గా ఎంతగానో అద్భుత ప్రస్థానాన్ని కొనసాగించిన ఏపీ డివిలియర్స్, ఇక వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు అయినా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక యుగం ముగిసింది అని ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఆటగాళ్లు లేకుండా ఐపిఎల్ ఊహించగలమా అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: