సూర్య కుమార్ కీలక టైంలో చేతులెత్తేసాడు : వసీం జాఫర్

praveen
వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా జట్టు మంచి ప్రదర్శన చేసి సెమీఫైనల్ వరకు చేరింది అంటే అందులో ఇక విరాట్ కోహ్లీ పాత్ర  ఎంతో కీలకమైనది అని చెప్పాలి. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేస్తున్న సమయంలో కూడా విరాట్ కోహ్లీ మాత్రం కఠిన సమయాల్లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. ఈ క్రమంలోనే టీమిండియా తరఫున మాత్రమే కాదు పూర్తిగా వరల్డ్ కప్ లో కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. అయితే విరాట్ కోహ్లీ తర్వాత ఆ రేంజ్ లో ప్రదర్శన చేసి టీమిండియా తరఫున టాప్ స్కో్రర్ కొనసాగుతుంది సూర్య కుమార్ యాదవ్ అని చెప్పాలి.

 తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సూర్య కుమార్ యాదవ్ మిస్టర్ 360 అని తనకు వచ్చిన బిరుదును సార్ధకం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగానే రాణించాడు. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శన పై ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ మాత్రం సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన తీరును వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి.

 టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ మూడు మ్యాచ్లలో అర్థ సెంచరీలతో రానించి టీమిండియా తరఫున రెండవ టాప్ స్కోరర్ గా ఉన్నప్పటికీ కీలకమైన మ్యాచ్ లలో మాత్రం సరిగా ఆడలేదని వసీం జాఫర్ విమర్శించాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో.. బంగ్లాదేశ్ తో జరిగిన కీలకమైన మ్యాచులో.. ఇక డూ ఆర్ డై మ్యాచ్ అయిన ఇంగ్లాండ్ పై కూడా అంచనాలకు తగ్గట్టుగా సూర్యకుమార్ ఆడలేదు. ఇలా జట్టుకు అవసరమైనప్పుడు ఆడకపోతే లాభమేంటి అంటూ విమర్శించాడు. అంతేకాకుండా ఇండియా కంటే పాకిస్తాన్ బౌలింగ్ లైన్ బలంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: