రేపు ఫైనల్ లో ఇంగ్లాండ్ పై పాకిస్తాన్ గెలవాలంటే... ?

VAMSI
భారత్ కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్యన టీ 20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ జరగనుంది. అక్టోబర్ 16 నుండి స్టార్ట్ అయిన ఈ పొట్టి ప్రపంచ కప్ రేపటితో పూర్తి అయిపోతుంది. ఇంగ్లాండ్ జట్టును ఫైనల్ కు చేరుకుంటుందని ముందుగానే ఊహించిన క్రికెట్ విశ్లేషకులు మరియు ప్రముఖులు పాకిస్తాన్ ను మాత్రం తాను జింబాబ్వే తో ఓడిపోయిన రోజునే నాక్ ఔట్ కు చేరదు అని ఫిక్స్ అయిపోయారు. కానీ అనుకోనివి జరగడమే పొట్టి క్రికెట్ మాయాజాలం. ఎవ్వరూ ఊహించని విధంగా పాకిస్తాన్ కు కాలం కలిసి వచ్చి నెదర్లాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడింది, ఆ ఫలితమే పాకిస్తాన్ ను సెమీస్ చేరేలా చేసింది.
ఇక సెమీస్ కు చేరుకున్న పాకిస్తాన్ వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే చాలా పొరపాటు అని భావించిందో ఏమో ... మొదటి సెమీఫైనల్ లో న్యూజీలాండ్ ను చిత్తు చిత్తు గా ఓడించి మొదటి ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. రెండవ సెమీస్ లో ఇండియా ఇంగ్లాండ్ పై దారుణంగా ఓటమి పాలవడంతో ఇంగ్లాండ్ పాకిస్తాన్ ను రేపు టైటిల్ కోసం ఢీ కొట్టనుంది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే రేపు మెల్బోర్న్ లో వర్షం పడే ఛాన్స్ ఎక్కువగా ఉందట. ఒకవేళ మ్యాచ్ జరిగితే ఎవరు గెలిచి వరల్డ్ కప్ ను ముద్దాడనున్నారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇరు జట్లు ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే మాత్రం ఇంగ్లండ్ పక్కాగా పాకిస్తాన్ ను ఓడించి కప్ ను ఎగరేసుకుపోతుంది.
ఈ మ్యాచ్ లో కూడా మొదట టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు అవకాశాలు ఎక్కువ. కీలకం అయిన ఈ మ్యాచ్ లో బాగా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది. పాకిస్తాన్ టీమ్ లో మరోసారి ఓపెనర్లు బాబర్ ఆజాం మరియు మహమ్మద్ రిజ్వాన్ లు రాణిస్తే గెలుపు దక్కే ఛాన్స్ ఉంటుంది. ఇక వీరికి బలహీనం ఏమిటంటే... మిడిల్ ఆర్డర్. మ్యాచ్ మ్యాచ్ కు బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చడం కూడా వీరికి కలిసొచ్చే అవకాశం లేదు. ఎప్పటిలాగే ఎవరు ఏ స్థానంలో అయితే ఆడుతున్నారో వారిని అదే స్థానంలో వచ్చేలా చూడాలి. ఇక షాన్ మసూద్, మోహాద్ నవాజ్ లు అంచనాలకు తగినట్లు రాణిస్తే పాకిస్తాన్ కు గెలుపు ఖచ్చితం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: