మిస్టర్ 360 సూర్య బ్యాటింగ్ గురించి.. కోచ్ ద్రావిడ్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు భారత జట్టు సెమి ఫైనల్లో అడుగు పెట్టింది అంటే అందులో కీలకపాత్ర వహించింది విరాట్ కోహ్లీ అని ప్రతి ఒక్క భారత క్రికెట్ ప్రేక్షకుడు చెబుతాడు.  అయితే విరాట్ కోహ్లీ తర్వాత ఆ రేంజ్ లో బ్యాటింగ్ చేసి ఇక జట్టును కష్ట సమయంలో ఆదుకొని ఇక జట్టును విజయతీరాలకు నడిపించిన బ్యాట్స్మెన్ ఎవరు అంటే అందరూ చెప్పేది సూర్య కుమార్ యాదవ్ అని చెప్పాలి.

 తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో సూర్యకుమార్ యాదవ్ ఏకంగా క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆకట్టుకున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి అటు జట్టు విజయంలో ప్రధాన పాత్ర వహించాడు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక విరాట్ కోహ్లీ తర్వాత జట్టులో ఎక్కువ పరుగులు చేసింది కూడా సూర్య కుమార్ యాదవ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేస్తున్న అటు సూర్య కుమార్ యాదవ్ తన పోరాటపాటిమని కనపరిచాడు. ఇక ఇటీవల జింబాబ్వేలతో జరిగిన మ్యాచ్లో అయితే సూర్య కుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ఆట తీరు అందరిని మంత్రముగ్ధులని చేసింది. 25 బంతుల్లో 61పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

 ఇకపోతే ఇటీవల 360 డిగ్రీస్  ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పై టీన్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. సూర్య కుమార్ ఆట తీరు చూస్తూ ఉంటే   ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు  ఇక టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఏకంగా 225 పరుగులు చేసి భారత జట్టు తరఫున రెండవ అత్యధిక స్కోరర్ గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. ఇక ప్రతి గేమ్ లో కూడా సూర్యకుమార్ జట్టుకు అవసరమైనప్పుడు మంచి ప్రదర్శన కనబరిస్తున్నాడు అంటూ రాహుల్ ద్రావిడ్ అతని ఆకాశాన్ని ఎత్తేసాడు. గతంలో కంటే ప్రస్తుతం సూర్య మరింత మెరుగ్గా కనిపిస్తున్నాడని జట్టులో అతను అద్భుతమైన ఆటగాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: