సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఇండియా ఓడించాలంటే... !

VAMSI
ఆస్ట్రేలియా వేదికగా గత నాలుగు వారాలుగా టీ 20 వరల్డ్ కప్ ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న విషయం తెలిసిందే. సూపర్ 12 దశ నిన్న జరిగిన మ్యాచ్ లతో ముగిసిపోయిది. చివరికి నాలుగు జట్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచి సెమీఫైనల్ కు దూసుకు వెళ్లాయి. ఎంతో నాటకీయ రీతిలో గత వరల్డ్ కప్ సెమిఫైనలిస్ట్ పాకిస్తాన్ కూడా సెమీస్ బెర్త్ ను దక్కించుకుంది. నిన్న షాకింగ్ ఆటతో సౌత్ ఆఫ్రికాను నెదర్లాండ్ ఓడించడంతో పాకిస్తాన్ కు సులువు అయింది. ఆ తవ్రతః మ్యాచ్ లో బంగ్లాను మట్టికరిపించి సెమీస్ కు వెళ్ళింది. ఇప్పుడు సెమీస్ లో ఇండియా, ఇంగ్లాండ్ , న్యూజీలాండ్ మరియు పాకిస్తాన్ లు ఉన్నాయి.
ఇందులో నవంబర్ 9 న సిడ్నీ వేదికగా పాకిస్థాన్ మరియు న్యూజిలాండ్ ల మధ్యన మొదటి సెమీఫైనల్ జరగనుంది. ఆ తరువాత రోజునే ఇండియా మరియు ఇంగ్లాండ్ ల మధ్యన రెండవ సెమీఫైనల్ జరుగుతుంది, ఈ మ్యాచ్ కు అడిలైడ్ వేదిక కానుంది. ఇక గత వరల్డ్ కప్ లో సెమీస్ కు కూడా చేరని ఇండియా ఈసారి అద్భుతంగా ఆడి సెమీస్ కు చేరుకుంది. కానీ ఇంగ్లాండ్ ను ఈజీ గా తీసుకుంటే ఓటమి తప్పదు.
ముఖ్యంగా ఈ మ్యాచ్ లో బలమైన ఇంగ్లాండ్ ను ఎదుర్కోవాలంటే ?
టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుని భారీ స్కోర్ ను టార్గెట్ గా పెట్టి ఇంగ్లాండ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాలి.
ఒకవేళ టాస్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా పడితే, తక్కువ స్కోర్ కు వారిని పరిమితం చెయ్యాలి. ఇక బ్యాటింగ్ లో సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణిస్తున్న అలెక్స్ హేల్స్, బట్లర్ , మొయిన్ అలీ మరియు లివింగ్స్టన్ లను అడ్డుకోవాలి. లేదంటే మరోసారి వరల్డ్ కప్ టైటిల్ అందని ద్రాక్షలా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక మన బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలంటే రోహిత్ రాణించాల్సిన అవసరం ఉంది. టాప్ ఆర్డర్ లో రాహుల్ , కోహ్లీ మరియు సూర్యకుమార్ యాదవ్ లు ఇండియాను ఆదుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయితే ఇండియా పరిస్థితి ఏమిటి అన్న విషయం కూడా చర్చల్లో ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: