నేను ప్రపంచ నెంబర్.1 గా ఉన్నా.. అది మాత్రం తప్పదు కదా : సూర్య కుమార్

praveen
సూర్య కుమార్ యాదవ్... భారత జట్టులో స్టార్ బాట్స్మన్ గా కొనసాగుతున్న ఈ ఆటగాడు.. ప్రస్తుతం పవర్ఫుల్ హిట్టింగ్ కి మారుపేరుగా మారిపోయాడు అని చెప్పాలి. ఏకంగా ప్రత్యర్థి ఎవరైనా సరే బౌలర్లకు సింహా స్వప్నంగా మారిపోతున్నారు. బౌలర్ బంతి ఎక్కడ వేసిన సరే తాను కొట్టాలనుకున్న షాట్లను భయం బెరుకు లేకుండా కొడుతూ బౌండరీకి బంతిని తరలిస్తూ ఉన్నాడు. ఇలా బౌలర్ల నుంచి పరుగులు ఎలా రాబట్టుకోవాలో అనే విషయంలో సూర్య కుమార్ యాదవ్ పిహెచ్డి చేశాడేమో అని అనిపిస్తూ ఉంటుంది అతని బ్యాటింగ్ చూస్తూ ఉంటే.

 ఇక వరల్డ్ కప్ లో భాగంగా తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఇక ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన అభిమానులు అందరిని కూడా ఉర్రూతలూగించాడు. ఏకంగా 25 బంతులు లోనే 60 కి పైగా పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక అతని ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉండడం గమనార్హం. ఇప్పటికే టీమిండియా ముఖ్యమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో భయం బెరుకు  లేకుండా సూర్యకుమార్ యాదవ్ ఆడిన షాట్లు మాత్రం అందరికీ ఆశ్చర్యానికి లోను చేశాయి.

ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ నేను హార్దిక్ కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్లాన్ చాలా స్పష్టంగా ఉంది. పాజిటివ్ ఇంటెన్ట్ తో ఆడాలని అనుకున్నాము. ఇక బంతిని గట్టిగా కొట్టడం ప్రారంభించాం. జట్టులో వాతావరణం బాగుంది అంటూ సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. ఇక నేను పరిస్థితిని బట్టి జట్టుకు ఏం కావాలో అలాగే బాటింగ్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచ నెంబర్ వన్ గా ఉన్నారు కదా అంటూ ప్రశ్నించగా.. ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో ఉన్న స్కోరు మాత్రం సున్నా నుంచే ప్రారంభించాలి కదా అంటూ ఒక ఆసక్తికర సమాధానం చెప్పాడు సూర్య కుమార్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: