సూర్య కుమార్ ఆటపై.. డూప్లెసిస్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా ఆటగాల్లతో పోల్చి చూస్తే అటు టీమ్ ఇండియాలో కాస్త ఆలస్యంగానే చోటు సంపాదించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. కానీ జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి బ్యాటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. తన అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఫిదా చేసేస్తూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు సాధిస్తూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. అదే సమయంలో తన ఆటతీరుతో టీమ్ ఇండియాలో నాలుగవ స్థానంలో నమ్మదగిన బ్యాట్స్మెన్ గా  మారిపోయాడు సూర్య కుమార్ యాదవ్ అని చెప్పాలి.

 ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో కూడా ప్రతి మ్యాచ్లో మంచి ప్రదర్శన చేస్తున్న సూర్య కుమార్ యాదవ్ అటు జట్టు ప్రదర్శనలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన పై సూర్య కుమార్ యాదవ్ ఆడే సొగసైన షాట్లపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రస్తుత క్రికెటర్లు కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.  ఇలా సూర్యకుమార్ యాదవ్ ఆటకు ఫిదా అయిన ఆటగాళ్లలో సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ డూప్లెసెస్ కూడా చేరిపోయాడు. భారత బ్యాటర్ సూర్యకుమార్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.

 ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తనదైన షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పట్టించగల సమర్థుడు సూర్య కుమార్ యాదవ్ అంటూ ఫ్యాప్ డూప్లెసెస్ పేర్కొన్నాడు. ఎంతో ఒత్తిడిలో అయినా సరే భయం బెరుకు లేకుండా ప్రశాంతంగా షాట్లు కొట్టగలడు అంటూ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఎక్కడ బ్యాట్ నూ ఝలిపించాలి.. ఎక్కడ టాప్ గేర్ మార్చాలి అన్న విషయం సూర్య కుమార్ యాదవ్ కి బాగా తెలుసు. అతని ఆట తీరు అద్భుతం అంటూ డూప్లెసెస్ ప్రశంసల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: