పోలీస్ చలాన్ : వీడి యాక్టింగ్ తగలెయ్యా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే?

praveen
రోడ్డు నిబంధనలు పాటించాలని నిబంధన ప్రకారమే వాహనాలు నడపాలని అటు ట్రాఫిక్ పోలీసులు ఎంతలా మొత్తుకుంటున్నా వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ముగ్గురు నలుగురు వెళ్తూ ఉన్న ఘటనలు కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తూ ఉండడం గమనార్హం.

 అయితే ఒకప్పుడు ఇలా పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులకు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం పోలీసుల చేతిలో కెమెరాలు ఉండడంతో ఇక ఎటువైపు నుంచి దాక్కుని వెళ్లినా కూడా పోలీసులు ఎంతో చాకచక్యంగా ఫోటో తీస్తూ ఇంటికే చలాన్లు పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని కొన్ని సార్లు పోలీసులకు పట్టుబడిన వాహనదారుడు జరిమానాల నుంచి తప్పించుకోవడానికి ఇక ఆస్కార్ అవార్డు లెవెల్లో యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది.

 ఈ వీడియోలో భాగంగా నలుగురు యువకులు ఒక బైక్ పై వెళుతూ ఉంటారు. అంతలో అక్కడ పోలీసులు వారిని అడ్డగిస్తారు. దీంతో ఇక వాహనాన్ని నడుపుతున్న ఒక యువకుడు ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేయడం మొదలుపెడతాడు. ఏకంగా చలి జ్వరం వచ్చిందని.. మూర్చ వస్తున్నట్లుగా యాక్టింగ్ చేయడం చేస్తూ ఉంటాడు. అప్పటికే పోలీసులకు అతను కావాలని చేస్తున్నాడని అర్థమవుతుంది. అతనికి తాగడానికి నీరు తెచ్చి ఇచ్చినా  కూడా కనీసం వాటర్ బాటిల్ పట్టుకునేంత శక్తి కూడా తనలో లేదు అన్నట్లుగా యాక్టింగ్ చేస్తాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి ఎంతో మంది నెటిజెన్స్  నవ్వుకుంటున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: