సమయం ఆసన్నమైంది.. పాక్ జట్టులో ఆ ఇద్దరిని విడదీయాల్సిందే?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో ఏ ఫార్మాట్లోనైనా సరే ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఓపెనర్లుగా వచ్చిన జోడి మంచి ఆరంభాలు ఇచ్చినప్పుడే జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో బెస్ట్ ఓపెనింగ్ జోడిగా పేరు తెచ్చుకున్న ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇక తమ ఓపెనింగ్ జోడితో ఎంతో చరిత్రను సృష్టించారు అని చెప్పాలి. అయితే ఇలా బెస్ట్ ఓపెనింగ్ జోడిగా పేరు తెచ్చుకున్న వారిలో పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అంతర్జాతీయ క్రికెట్లో వీరిద్దరి ఓపెనింగ్ జోడి సంచలనాలే సృష్టించింది. గత రెండేళ్లుగా ఈ జోడి నెలకొల్పిన భాగస్వామ్యాలు చూస్తే ఇక క్రికెట్ ప్రపంచానికి అది అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వీరి సక్సెస్ వీరిని కష్టాల్లో పడేసింది. మొన్నటి వరకు బాగా రాణించిన ఈ ఓపెనింగ్ జోడి ఇప్పుడు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది. అభిమానుల అంచనాలను చేరుకోలేక పోతుంది. దీంతో వీరిద్దరి ఓపెనింగ్ జోడిని బ్రేక్ చేయాల్సిన అవసరం వచ్చిందా అంటే ప్రస్తుతం అవును అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.. గత కొంతకాలంగా భీకరమైన ఫామ్ లో ఉన్న రిజ్వాన్ ఇటీవలే వరల్డ్ కప్ లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. బాబర్ తన పేలవమైన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు..

 మరోవైపు కెప్టెన్ గా కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇద్దరు ఓపెనింగ్ జోడి జట్టుకు వెన్నుముక లాంటిది. కానీ వీరే రాణించకపోవడంతో పాకిస్తాన్ కష్టాల్లో పడిపోతుంది. అయితే వీరిద్దరూ మంచి ఫామ్ లో ఉండడంతో మరో ఓపెనింగ్ ప్రత్యామ్నయం పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టి పెట్టలేదు. అయితే సాధారణంగా ఫకర్ జమాన్  మూడవ స్థానంలో వస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు అతని స్థానంలో షాన్ మసూద్ ను ఎంపిక చేశారు. అయితే పకర్ జమాన్ ను ఓపెనింగ్ స్లాట్ లో ఆడిస్తే బాగుంటుందని ప్రస్తుతం అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబర్,,  రిజ్వాన్ ఓపెనింగ్ జోడిని విడదీయాల్సిందే అంటూ అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: