ప్చ్.. పాపం సౌత్ ఆఫ్రికా.. దురదృష్టం వెంటాడింది?

praveen
సాధారణంగా వరల్డ్ కప్ లో విజయం సాధించాలి అంటే హార్డ్ వర్క్ తోపాటు లక్కు కూడా ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు లక్కు కలిసి రాకపోతే మాత్రం గెలవాల్సిన మ్యాచ్లో కూడా ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మంచి ప్రదర్శన చేసిన లక్కు మన వైపే ఉంది అని అనిపించినప్పటికీ అటు ప్రకృతి మాత్రం చివరికి పగబట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో ఎన్నోసార్లు జరిగింది. అంతా సాఫీగా జరుగుతుందనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ప్రకృతివైపరీత్యాల కారణంగా చివరికి మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే వరల్డ్ కప్ లో భాగంగా కూడా ఇలాంటిదే జరిగింది. వరల్డ్ కప్ లో ఎట్టి పరిస్థితుల్లో విశ్వవిజేతగా నిలవాలని లక్ష్యంతో ప్రతి జట్టు బరిలోకి దిగింది. తమ ప్రత్యర్ధిని ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను కూడా సిద్ధం చేసుకున్నాయి. ఇలాంటి సమయంలో అటు వరుణ దేవుడు మాత్రం ప్రతి జట్టును ఊహించని పరీక్షలు పెడుతున్నాడు అని చెప్పాలి. జట్టు సమిష్టిగా రాణిస్తున్నప్పటికీ వరుణ దేవుడు పెట్టిన పరీక్షల ముందు చివరికి జట్టు తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.

 తప్పకుండా భారీ విజయం సాధించి తీరుతాము అని భావించిన సౌత్ ఆఫ్రికాకు దురదృష్టం వెంటాడింది అని చెప్పాలి. జింబాబ్వేపై గెలిచే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో చివరికి  ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు అంపైర్లు. అయితే 9 ఓవర్లకు మ్యాచ్ కుదించగా 81 పరుగుల చేజింగ్తో బరిలోకి దిగింది సౌత్ ఆఫ్రికా. అయితే ఓకే ఓవర్లో 24 పరుగులు చేసింది  అనంతరం వర్షంతో 7 ఓవర్లకు మ్యాచ్ కుదించారు. కాగా మూడు ఓవర్లలో 54 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో24 బంతుల్లో  13 రన్స్ కావాల్సి ఉండగా మళ్లీ వర్షం పడడంతో మ్యాచ్ రద్దు అయింది. దీంతో చెరో పాయింట్ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: