పాక్ అభిమాని ఎటకారం.. గూగుల్ సీఈవో కౌంటర్?

praveen
భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిందంటే చాలు అది భారత క్రికెట్ అభిమానులందరికీ కూడా ఎంతో ప్రత్యేకమైన చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా  కొనసాగుతున్న ఈ రెండు జట్లు ఇక ఎప్పుడు తలపడినా కూడా అది హై వోల్టేజ్ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది. అప్పటివరకు క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు సైతం టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి గర్జించింది...

 ఇక టీమిండియా కు ఓటమి ఖాయం అనే పరిస్థితి దగ్గర నుంచి ఊహించని విధంగా పుంజుకుంది టీమిండియా  ఈ క్రమంలోనే నరాలు తీగ ఉత్కంఠ మధ్య వచ్చే జరిగిన మ్యాచ్ లో నాలుగు క్రికెట్ల తేడాతో విజయం సాధించింది టీం ఇండియా   అయితే తీవ్ర ఒత్తిడి మధ్య ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో అటు భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.ఈ క్రమంలోనే ఒకరోజు ముందుగానే దీపావళి జరుపుకున్నారు.ఇక దేశ విదేశాలలో ఉన్న భారతీయులందరూ టీమిండియా విజయాన్ని కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

 ఈ క్రమంలోనే ఏకంగా భారత్ కి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ట్విట్ చేసాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ సాధించిన విజయంతో తన దివాళి సంబరాలు మొదలయ్యాయి అంటూ ట్విట్  చేశాడు. గొప్ప సమయాన్ని అందరూ తమ స్నేహితులు కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తున్న.  చివరి మూడు ఓవర్లు మరోసారి చూడటం ద్వారా నేను దీపావళి సంబరాలు చేసుకున్నాను అంటూ సుందర్ పిచాయ్ పోస్ట్ పెట్టగా దీనికి ఒక నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు  మీరు మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది అంటూ కౌంటర్ ఇవ్వగా అవును అవి కూడా చూశాను. మొదటి మూడు ఓవర్లలో అర్షదీప్ భువనేశ్వర్ భలే భౌలింగ్ చేశారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: