టి20 వరల్డ్ కప్.. ఇండియాను ఫైనల్ లో ఢీకొట్టేది ఆ జడ్డే : జహీర్ ఖాన్

praveen
టి20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. అయితే సూపర్ 12 మ్యాచ్లు మాత్రం నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పాలి.. అయినప్పటికీ మాజీ ఆటగాళ్లు ఖాళీగా ఉండడం ఎందుకు అనుకుంటున్నారో లేకపోతే రివ్యూలు ఇవ్వడం తమ బాధ్యత అనుకుంటున్నారో తెలియదు కానీ ఇక ఎప్పుడు తమ రివ్యూ లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నారు అని చెప్పాలి. వరల్డ్ కప్ లో జరగబోయే ప్రతి మ్యాచ్ లో గెలిచే జట్టు ఏది? ఇక వరుస విజయాలతో సెమీఫైనర్లు అడుగుపెట్టే నాలుగు జట్లు ఏవి? సెమీఫైనల్ నుంచి ఫైనల్ పోరుకు చేరే జట్లు ఏవి? అనే విషయంపై ఇక తమ రివ్యూలు చెప్పేస్తూ ఉన్నారు.

 అంతేకాదు ఇక వరల్డ్ కప్ విజేత ఎవరు అన్న విషయంపై కూడా ముందే ఒక అంచనాకు వచ్చేస్తున్నారు అని చెప్పాలి. భారత మాజీ క్రికెటర్లతో పాటు అటు విదేశీ మాజీ క్రికెటర్లు కూడా ఎక్కువగా వరల్డ్ కప్ విజేత ఎవరు అనే విషయంపై టీమిండియా పేరుని తెరమీదకి తీసుకువస్తున్నారు అని చెప్పాలి. భారత మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ సైతం ఇదే విషయంపై స్పందించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కచ్చితంగా టీమిండియనే నా ఎంపిక.. జట్టుకు కీలక ఆటగాళ్లు దూరమైన మాట వాస్తవమే.. బుమ్రా లాంటి బౌలర్ లేకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 కానీ టీమ్ ఇండియా మాత్రం కొన్నిళ్లుగా ఎంతో స్థిరంగా క్రికెట్ ఆడుతుంది. ఇక ప్రతి జట్టుకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే భారత్ తర్వాత ఇంగ్లాండ్ నుంచి అలాంటి పోటీ చూడవచ్చు. ఈ రెండు జట్లు తప్పకుండా ఫైనల్ కు వెళ్తాయని నా అంచనా అంటూ జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే జట్టుకు కీలక ఆటగాలైన రవీంద్ర జడేజ, బుమ్రా దూరం కావడంతో ఇక ఇప్పుడు వీరు లేకుండా టీమిండియా ఎలా రానిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా రేపు పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: