బుమ్రా బాటలోనే అర్షదీప్.. జట్టుకు దూరం అవుతాడా?

praveen
ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆటగాళ్లతో బరిలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లో విశ్వవిజేతగా నిలవమే లక్ష్యంగా పెట్టుకుంది టీమ్ ఇండియా జట్టు. అయితే గత కొంతకాలం నుంచి టీమిండియా ప్రదర్శన చూస్తూ ఉంటే ఇక ఈసారి టీమిండియా కప్పు కొట్టడం ఖాయం అన్నది తెలుస్తుంది. ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ జట్టు టీమ్ ఇండియా నే అంటూ తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు.

 ఇలాంటి సమయంలోనే అటు టీమ్ ఇండియాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రవీంద్ర జడేజా లాంటి కీలకమైన ఆల్రౌండర్ దూరమయ్యాడు. అయితే మొన్నటికి మొన్న గాయం నుంచి కోరుకున్న బుమ్రా  మళ్లీ జట్టుతో చేరినప్పటికీ ఇక గాయం తిరగబెట్టడంతో ఇక వరల్డ్ కప్ మొత్తానికి  దూరం అవుతున్నాడు అన్న విషయాన్ని ఇటీవల బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.  ఇకపోతే ఇలాంటి ఎదురు దెబ్బలు నడుమ ఇక ఇప్పుడు అభిమానులు అందరిలో కూడా కొత్త భయం మొదలైంది అని చెప్పాలి. ఇటీవలే స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో మూడవ టి20 మ్యాచ్ ఆడింది టీం ఇండియా.

 ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే అప్పటికే రెండు విజయాలు సాధించడంతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ విషయం పక్కన పెడితే జట్టులో యువ ఫేసెస్ అర్షదీప్ ఆడక పోవడం మాత్రం అందరిలో ఆందోళన కలిగించే అంశంగా మారిపోయింది. ఇక వెన్నునొప్పి కారణంగానే అర్షదీప్ జట్టుకు అందుబాటులో లేడు అన్నది తెలుస్తుంది.. అయితే ఆశదీప్ గాయం పై స్పందించిన రోహిత్ శర్మ అతని గాయం పెద్దదేమి కాదు ముందస్తు చర్యలో భాగంగానే అతనికి విశ్రాంతి ఇచ్చాం అంటూ తెలిపాడు. గతంలో బుమ్రా విషయంలో కూడా ఇలాంటి మాటలు చెప్పారు. కానీ చివరికి బుమ్రా దూరం అయ్యాడు. ఇక ఇప్పుడు ఆర్శదీప్ కూడా దూరమైతే టీమిండియా పరిస్థితి ఏంటో అని అందరూ ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: