హ్యాట్రిక్ సాధించిన టీమిండియా.. తిరుగులేని విజయం?

praveen
గత కొంతకాలం నుంచి భారత మహిళల జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో అయితే భారత మహిళల జట్టు చేస్తున్న ప్రదర్శన క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పాలి.  కాగా ఇదే జోరులో ప్రస్తుతం ఆసియా కప్ కూడా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లో భారత మహిళల జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 ఇలాంటి సమయంలోనే అంచనాలకు మించి రాణిస్తున్న భారత మహిళల జట్టు ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో విజయ డంకా మోగిస్తుంది. ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆదిపత్యాన్ని కనబరుస్తూ ప్రత్యర్థి జట్లను చిత్తుగా ఓడిస్తుంది  అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆసియా కప్ లో భాగంగా రెండు విజయాలు సాధించి అదరగొట్టిన భారత మహిళల జట్టు ఇక ఇటీవల హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. మహిళల ఆసియా కప్ లో భాగంగా యూఏఈ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 14 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది భారత మహిళల జట్టు.

 ఇక ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది టీమిండియా. ఈ క్రమంలోనే నిర్ణయిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది అని చెప్పాలి. నామమాత్రమైన లక్ష్యంతో బలిలోకి దిగిన యూఏఈ జట్టు  భారత బౌలింగ్ దాటికి ఎక్కువ పరుగులు చేయలేకపోయింది.  వరుసగా బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం మొదలుపెట్టారు.  దీంతో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా ఏకంగా 104 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది టీం ఇండియా జట్టు. హ్యాట్రిక్ విజయాలతో సెమిస్ లో అడుగుపెట్టే అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: