విరాట్ కోహ్లీ రికార్డ్.. సమం చేసిన బాబర్?
గత కొంతకాలం నుండి చూసుకుంటే కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా బాబర్ అజాం టార్గెట్ పెట్టుకున్నాడెమో అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇప్పటికే తన ఆట తీరుతో కోహ్లీ సాధించిన పలు రికార్డులను బద్దలు కొట్టిన బాబర్ అజాం ఇక ఈ రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్నటి వరకు పేలవమైన ఫామ్ లో ఇబ్బంది పడిన బాబర్ అజాం మళ్లీ మునుపటి లయను అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే.దీంతో మరోసారి పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక పాకిస్తాన్ జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తున్నాడు.
ఇక ఇటీవలే కోహ్లీ సాధించిన మరో రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం సమం చేశాడు. అంతర్జాతీయ టి20 లలో 81 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ 3000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా 81 ఇన్నింగ్స్ లోనే 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన ఆరవ టీ20 లో భాగంగా 87 రన్స్ చేయడంతో ఇక ఈ రికార్డును అందుకున్నాడు బాబర్ ఆజం. 59 బంతుల్లో మూడు సిక్సర్లు ఏడు ఫోర్ల సహాయంతో 87 పరుగులు చేశాడు. అంతేకాదు తన టి20 కెరియర్ లో 29వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి.