ధావన్, కోహ్లీలను.. వెనక్కి నెట్టిన సూర్య కుమార్?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ అంటే చాలు పవర్ హిట్టింగ్ కు మారుపేరుగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న సూర్య కుమార్ యాదవ్ కాస్త లేటుగా వచ్చినప్పటికీ అటు టీమిండియాలో మాత్రం తన బ్యాటింగ్ తీరుతో పాతుకుపోతున్నాడు అని చెప్పాలి. టీమిండియా కు అతనే ఫ్యూచర్ స్టార్ అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు సూర్య కుమార్ యాదవ్.  ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ తన మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉన్నాడు.

 ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో 33 బంతుల్లోనే 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన సూర్య కుమార్ యాదవ్ ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కూడా ఇదే రీతిలో ప్రదర్శన చేశాడు. 33 బంతుల్లో ఆప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇక జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఎలాంటి బంతులను సంధించినప్పటికీ ఒత్తిడికి గురికాకుండా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

 ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు సూర్య కుమార్ యాదవ్. మొదటి టి20 మ్యాచ్లో 50 రన్స్ చేసిన సూర్య కుమార్ యాదవ్... ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.  ఇప్పటివరకు సూర్య కుమార్ యాదవ్ 732 పరుగులు చేశాడు. కాగా శిఖర్ ధావన్ 689 పరుగులు, విరాట్ కోహ్లీ 641 పరుగుల రికార్డును సూర్య కుమార్ యాదవ్ బ్రేక్ చేశాడు. ఇక రానున్న రోజుల్లో కూడా అతని బ్యాటింగ్ విధ్వంసం ఇలాగే కొనసాగితే మాత్రం అటు టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కు తిరిగి ఉండదు అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: