రోహిత్ సేన సఫారీలపై ప్రతీకారం తీర్చుకుంటుందా ?

VAMSI
రెండు రోజుల క్రితమే ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్యన మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ముగిసింది. హోరా హోరీగా సాగిన ఈ సిరీస్ లో రోహిత్ సేన చెలరేగి ఆడి 2-1 తో సిరీస్ ను దక్కించుకుంది. ఈ సిరీస్ లో ముఖ్యంగా కోహ్లీ, సూర్య కుమార్, అక్షర్ పటేల్ లు అద్భుతంగా రాణించారు. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ఈ రోజు నుండి మూడు టీ20 లు మరియు మూడు వన్ డే లను సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. ఈ రోజు సాయంత్రం గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది, ఈ మ్యాచ్ కు కేరళ లోని తిరువనంతపురం వేదిక కానుంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న ఇండియాను సౌత్ ఆఫ్రికా ఓడించడం ఆంధ్ సులభం కాదు.
కానీ సఫారీలు సొంత గడ్డపై మనల్ని ఓడించిన సంగతి సైతం మరిచిపోకూడదు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల ఆటగాళ్లు సఫారీ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా డీకాక్, మార్కరామ్, మిల్లర్ , రబడా, శంసి లు వారికీ కీలకం కానున్నారు. ఇండియా పిచ్ లు స్పిన్ కు ఏ విధంగా సహకరిస్తాయి తెలిసిందే. కాబట్టి శంసి ని ఆడడం కొంచెం కష్టం అవ్వొచ్చు. ఇక ఇండియాలో కీలక ఆటగాళ్లు అంటే రోహిత్, కోహ్లీ, సూర్య, అక్షర్ పటేల్, అర్సదీప్ సింగ్ లు... అంచనాలకు తగ్గట్లు వీళ్ళు ఆడితే మ్యాచ్ ను గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఇక మనము ఎప్పటి నుండో చెప్పుకుంటున్న విధంగా మ్యాచ్ రోజున ఎవ్వరైతే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారే విన్నర్ అవుతారు. సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ను 2 -1 తో మరియు వన్ డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సఫారీలను ప్రస్తుతం జరగబోయే టీ 20 మరియు వన్ డే సిరీస్ లలో చిత్తు చేసి అక్కడ ఎదురైన పరాభవానికి రోహిత్ సేన బదులు తీర్చుకుంటుందా ? లేదా మళ్ళీ సఫారీల దెబ్బకు తోక ముడుస్తుందా చూడాలి. కాగా ముందుగా టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గు చూపుతారు. మరి చూద్దాం ఈ రోజు జరిగే సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: