బుమ్రాతో జాగ్రత్తగా ఉంటాం : సౌత్ ఆఫ్రికా కెప్టెన్

praveen
ప్రస్తుతం టీమిండియాలో  బుమ్రా ఎంత కీలకమైన బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు ఎప్పుడు విజయాన్ని అందించడంలో బుమ్రా కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు బుమ్రా బౌలింగ్ కు వస్తున్నాడు అంటే చాలు పరుగులు చేయడానికి కాదు వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. బుమ్రా బౌలింగ్ లో ఆరు బంతులు అయిపోయాయి  అంటే చాలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు.  ఇలా తన బౌలింగ్లో బంతులతో మెరుపులు మెరూపిస్తూ ఉంటాడు బుమ్రా.

 అయితే మొన్నటికి మొన్న గాయం కారణం గా ఆసియా కప్ లో టీమిండియా కు దూరమైన బూమ్రా ఇటీవలే మళ్లీ టీమిండియా తో చేరి పోయాడు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్లలో టీమిండియా కు అందుబాటు లోకి వచ్చాడు. ఈ క్రమం లోనే మరో సారి తనదైన యార్కర్లతో దుమ్ము దులిపాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియాతో ఎంతో విజయవంతంగా టి20 సిరీస్ పూర్తి చేసుకున్న టీమిండియా నేటి నుంచి సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతుంది.

 తిరువనంతపురం వేదికగా నేడు మొదటి టి20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఇటీవలే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబ  బావుమా స్పందిస్తూ భారత్లో కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా భారత్ లో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న బుమ్రా తో ఎంతో జాగ్రత్తగా ఉంటామని తెలిపారు.  ముఖ్యంగా పవర్ ప్లే లో స్వింగ్ బంతులను ఆడటం తమకు ప్రధాన సవాల్ అంటూ చెప్పుకొచ్చాడు తెంప భావుమా. ఇక ఉత్తమ జట్టుతో పోటీ పడుతున్నాం కాబట్టి అత్యుత్తమంగా రాణించాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: