వైరల్ : టీమిండియా క్రికెటర్ల క్యాట్ వాక్ చూసారా?

praveen
ఇటీవల టీమిండియా మహిళల జట్టు ఒక అద్వితీయమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఎంతో పటిష్టమైన ఇంగ్లాండు జట్టును అది కూడా సొంత గడ్డపై మట్టికరిపించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవైపు వన్డే సిరీస్ ను సొంతం చేసుకోవడమే కాదు మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మూడు మ్యాచ్ లలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయడం మరో ఎత్తు అని చెప్పాలి. ఇక దాదాపు 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండుపై భారత మహిళల జట్టు ఇలాంటి అద్వితీయమైన విజయాన్ని సాధించింది.

 ఈ క్రమంలోని ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తన చివరి మ్యాచ్ ఆడిన టీమిండియా సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామికి హర్మన్ ప్రీత్ సేన సిరీస్ విజయాన్ని కానుకగా అందించింది. ఇక టీమిండియా అద్భుతమైన విజయం పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్వదేశానికి తిరుగు పయనమైన  టీమిండియా మహిళా క్రికెటర్లు ఎయిర్పోర్టులో సిరీస్ గెలిచిన సంతోషంలో ఎంతగానో ఎంజాయ్ చేసారు. పిపిఈ కిట్లు ధరించి క్యాట్ వాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ విషయాన్ని భారత మహిళా క్రికెటర్ జేమియా రోడ్రిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఈ వీడియో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

 జులాన్ గోస్వామి, హార్లిన్ డియోల్ మరి కొంతమంది మహిళా క్రికెటర్లు ఇక ఎయిర్పోర్టులో పిపిఈ కిట్లు ధరించి క్యాట్ వాక్ చేస్తూ కనిపించారు. ఏకంగా ఫ్యాషన్ మోడల్స్ ను అనుకరిస్తూ తెగ సందడి చేశారు అని చెప్పాలి. ఇకపోతే స్వదేశానికి చేరుకున్న భారత మహిళా క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన జులాన్ గోస్వామికి ఆల్రౌండర్ దీప్తిశర్మలకు ఎయిర్పోర్టులో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఫ్యాన్స్.  మరి ఇంకెందుకు ఆలస్యం ఇక టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ల క్యాట్ వాక్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: